దిగొచ్చిన సర్కార్: జిల్లాల విభజన నోటిఫికేషన్‌లో మార్పులు
జిల్లాల పునర్విభజన సెగ ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్టు దిగింది. జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్‌లో మార్పులు చేసింది. గుంటూరు జిల్లాలో నాలుగు మండలాలను నరసరావుపేట రెవెన్యు డివిజన్‌కు మార్పు చేసింది. పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చెంపేట మండలాలను నరసరావుపేట డివిజన్‌కు మార్చింది.
అలాగే అనంతపురం జిల్లాలో కదిరి రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయింది. ధర్మవరం రెవెన్యు డివిజన్ రద్దు చేసింది. ధర్మవరంలో ఉన్న నాలుగు మండలాలను పుట్టపర్తి రెవెన్యు డివిజన్‌లో కలిపింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యు డివిజన్‌లో విలీనం చేసింది.

పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. కానీ కొందరు కావాలనే వివాదం రాజేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది.
శ్రీకాకుళం కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. ఈ జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, అముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విజయనగరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపు కోట, గజపతినగరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా.. ఇంతకుముందు ఉన్నవాటిని కలుపుకొని ప్రకటించారు.












Click it and Unblock the Notifications