అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ రాజీనామా..! టిడిపిలో కొత్త టెన్ష‌న్‌..సోమిరెడ్డి ఎఫెక్ట్ : పాలిట్‌బ్యూరో లో తుది నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP MLC Somireddy Chandra Mohan Reddy Resigned For His MLC Post | Oneindia Telugu

టిడిపిలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనా మా చేసారు. దీంతో..ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్దులుగా బ‌రిలోకి దిగే వారిలో ఈ ఎఫెక్ట్ ప‌డింది. మంత్రి లోకేశ్ సైతం వ‌చ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారు. దీంతో..ఇప్పుడు ఆయ‌న సైతం ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తారా..ఇంకా ఎంత‌మంది ఈ లిస్టులో ఉన్నారు..

లోకేశ్ రాజీనామా చేస్తారా..

లోకేశ్ రాజీనామా చేస్తారా..

207 లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు ఎమ్మెల్సీగా నియ‌మితులై మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు లోకేశ్. ఈ నియామ‌కం పై ప్ర‌తిప‌క్షం నుండి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. గుంటూరు లేదా కృష్ణా జిల్లాల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుండి ఆయ‌న పోటీ చేయ‌నున్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నుండి పోటీ చేయ‌నున్నారు. దీంతో..ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనా మా చేయ‌టం..ఆమోదించ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇదే కోవ‌లో నెల్లూరు జిల్లా కే చెందిన మ‌రో మంత్రి నారాయ‌ణ పై ఇప్పుడు ఎఫెక్ట్ ప‌డుతోంది. ఆయ‌న సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుండి పోటీ చేయ‌నున్నారు. దీంతో..నా రాయ‌ణ సైతం ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే ఒత్తిడి పెరుగుతోంది.

బ‌రిలో దిగాలంటే రాజీనామా చేయాల్సిదేనా..

బ‌రిలో దిగాలంటే రాజీనామా చేయాల్సిదేనా..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ బ‌రిలో ఉండాలంటే ఎమ్మెల్సీ ప‌దవుల‌కు రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి టిడిపిలో ఏర్ప డింది రామ‌సుబ్బారెడ్డి, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డి నిర్ణ‌యాల‌తో ఇప్పుడు ఇత‌రుల మీద ప్ర‌భావం పడుతోంది. మంత్రి నారాయ‌ణ‌, ప‌య్య‌వుల కేశ‌వ్, అన్నం స‌తీష్‌, డొక్కా మ‌ణిక్య వ‌ర‌ప్ర‌సాద్ లు సైతం రాజీనామాలు చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌య్యావుల కేశ‌వ్ ఉర‌కొండ నుండి, అన్నం స‌తీష్ బాప‌ట్ల నుండి, డొక్కా మ‌ణిక్య వ‌ర ప్ర‌సాద్ తాడికొండ నుండి పోటీ చేయ‌నున్నారు. దీంతో..వారు ముందుగా ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టం ద్వారా అక్క‌డ కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో టిడిపి అధినాయ‌క‌త్వం ఉంది.

పాలిట్ బ్యూరోలో తుది నిర్ణ‌యం..

పాలిట్ బ్యూరోలో తుది నిర్ణ‌యం..

ఇక‌, ఇప్పుడు వీరంద‌రి రాజీనామా త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల పై చ‌ర్చించి పాలిట్ బ్యూరో స‌మావేశం లో తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇప్పుడు రాజీనామా చేసే వారిలో గ‌వ‌ర్న‌ర్ కోటా, ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థ‌ల కోటాలో గెలిచిన వారు ఉన్నారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో నియ‌మితులైన వారు రాజీనామా చేస్తే..ఆ వెంట‌నే ఆమోదించ‌టం..ఎన్నిక‌ల సంఘం నోటిఫై చేయ‌టం చేయాల్సి ఉంటుంది. అలా జ‌రిగితే తిరిగి వారి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం ద‌క్కుతుంది. ఇక‌, ఎమ్మెల్యేల కోటా.. స్థానిక సంస్థ‌ల కోటాలో గెలిచిన వారు రాజీనామా చేస్తే..ఆ స్థానాల్లో త‌క్ష‌ణం ఎన్నిక‌లు సాధ్యం కావు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అవుతే...ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఆల‌స్యం కానుంది. అయితే, ఖాళీ అయిన వారి స్థానంలో కొత్త వారికి ఆ సీట్ల‌ను చూపించి టిక్కెట్ల కేటాయింపు స‌మ‌యంలో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. దీని పై తుది నిర్ణ‌యం పాలిట్ బ్యూరో లో తీసుకోనున్నారు.

English summary
TDP MLC Somireddy Chandra Mohan Reddy resigned for his MLC post. Now this effect on more MLC's who contesting in up coming elections from tdp. Party will take final decision on this issue in Politbuero meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X