అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీతాలపై రానీ క్లారిటీ.. ప్రాసెస్ చేసేందుకు ఉద్యోగుల ససేమిరా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో పీఆర్సీపై ఉద్యోగులు పట్టువీడవడం లేదు.. ప్రభుత్వం బెట్టు వీడటం లేదు. దీంతో మరీ జీతాల సంగతి ఏంటీ అనే చర్చ జరుగుతుంది. ఒకటో తారీఖు దగ్గరకు వస్తుంది.. అయినా ఎవరూ తగ్గడం లేదు. ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉద్యోగుల అకౌంట్లలో జనవరి నెల జీతాలు పడటం అనుమానంగానే కనిపిస్తోంది.. జీతాలు ప్రాసెస్ చేయాల్సిందే అని ప్రభుత్వం.. మీరేం చేసినా ప్రాసెస్ చేసేది లేదంటూ ఉద్యోగులు భీష్మించుకోవడంతో ఒకటో తారీఖు వస్తున్న కొద్ది జీతాలపై సందిగ్దత నెలకొంది.

పీఆర్సీ ప్రకారమే జీతాలు..

పీఆర్సీ ప్రకారమే జీతాలు..


కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. జీతాలు ప్రాసెస్‌ చేయకపోతే చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస పెట్టి సర్క్యూలర్స్‌ జారీ చేస్తోంది. జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రకారం టైమ్‌ లైన్‌ నిర్ధేశించి దాని ప్రకారం గడువులోగా జీతాలివ్వాలని తేల్చి చెప్పింది. లేదంటే ఊరుకునేది లేదని హుకుం జారీ చేసింది. ట్రెజరీ ఉద్యోగులకు అండగా తామున్నామని పీఆర్సీ సాధన సమితి నేతలు అంటున్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

పాత జీతం..

పాత జీతం..


పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతాన్నే ఇవ్వాలన్నేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ చేస్తున్నారు. జనవరి నెలకు పాత జీతాలను డీఏలతో కలిపి ఇవ్వాలని ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక జీతాలను ప్రాసెస్ చేసే విషయంలో తమపై అంత ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం.. నిజంగా ఉద్యోగులపై ప్రేమ ఉంటే రూ. 1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు ఎందుకు ప్రాసెస్‌ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2 వేల 100 కోట్ల పీఎఫ్ ఇతర బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని అడుగుతున్నారు. జనవరి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని.. అదే జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. చర్చలకు రమ్మంటున్నా రాకుండా, జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా చేయకుండా ప్రభుత్వంపై పోరాటం చేయడం అనేది తసరికాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

చర్చలకు గైర్హాజరు

చర్చలకు గైర్హాజరు

ఉద్యోగులు చర్చలకు వస్తామని రాకపోవడంతో మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్‌గా ఫోన్ చేసినా రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీగా తాము ప్రతిరోజు వస్తున్నా ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు రావడంతో వారితో చర్చించడం జరిగిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబసభ్యులు ఆలోచించాలని సూచించారు. స్టీరింగ్ కమిటీ పిలిస్తేనే వస్తామని, వారితో చర్చలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. వాళ్లు చర్చలకు రాకుండా ఇలాగే వ్యవహరిస్తే, చట్టం ప్రకారం జరుగుతోందని హెచ్చరించారు.

English summary
suspense on january month employee salary. prc issue is continued with employees and andhra pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X