చంద్రబాబు భారీ ట్విస్ట్- వైసీపీ ఏకగ్రీవానికి బ్రేక్ : "రెబల్స్" కు ట్రాప్..!?

పార్టీలోని రెబల్స్ ను ఫిక్స్ చేసేందుకు చంద్రబాబు అనూహ్య నిర్ణయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్ట్. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీకి ఏకగ్రీవమని భావిస్తున్న వేళ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ దిశగా మంతనాలు సాగుతున్నాయి. వైసీపీకి ఏకగ్రీవం కాకుండా పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుబాటులో ఉన్న నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఏడు సీట్లకు నోటిఫికేష్ జారీ అయింది. వైసీపీ ఇప్పటికే ఏడుగురు అభ్యర్ధులను ఖరారు చేసింది. సరిగ్గా వారు నామినేషన్ దాఖలు సమయంలో చంద్రబాబు ఇటు కొత్త రాజకీయం ప్రారంభించారు. వైసీపీలో రెబల్స్ మద్దతు..తమ పార్టీ రెబల్స్ పైన చర్యల దిశగా ఈ ఎన్నికను సద్వినియోగం పైన టీడీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ..!

ఇప్పటికే ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల కోటాలో తొమ్మది స్థానాల్లో వైసీపీ అయిదు నియోజకవర్గాల్లో ఏకగ్రీవంగా విజయం సాధించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పటికే వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్ధులను పార్టీ ప్రకటించింది. వారంతా ప్రస్తుతం సీఎంతో సమావేశం అయ్యారు. కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ్రరి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం నామినేషన్లు వేయనున్నారు. వీరి ఎన్నిక ఏకగ్రీవం అని భావిస్తున్న వేళ టీడీపీ..కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ నుంచి అభ్యర్ధిని బరిలో నిలపాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నారు.

వైసీపీకి ఏకగ్రీవం కాకుండా...

వైసీపీకి ఏకగ్రీవం కాకుండా...

వైసీపీకి ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో అన్ని సీట్లు దక్కించుకోవటం ఖాయంగా ఉంది. కానీ, టీడీపీ మాత్రం వైసీపీకి ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరిగేలా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రస్తుత సభలో ఏడుగురి ఎమ్మెల్సీల గెలుపుకు ఒక్కొక్కరికి 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే, వైసీపీకి అధికారికంగా 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇతర పార్టీల నుంచి మద్దతుగా అయిదుగురు ఉన్నారు. టీడీపీకి 17 మంది సభ్యుల మద్దతు కనిపిస్తోంది. దీంతో, ఏడు సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లటం లాంఛనంగా మారింది. కానీ, తమ పార్టీకి చెందిన సభ్యుల మద్దతు వైసీపీకి వెళ్లకుండా విప్ జారీ చేసే అవకాశం పైన ఫోకస్ చేస్తున్నారు. అదే విధంగా వైసీపీ నుంచి రెబల్స్ వ్యతిరేక ఓటు పైనా టీడీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీ -వైసీపీ రెబల్స్ కు ట్రాప్

టీడీపీ -వైసీపీ రెబల్స్ కు ట్రాప్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా టీడీపీ గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, ఈ ఎన్నిక ద్వారా టీడీపీ రెబల్స్ ను ఇరకాటంలోకి నెట్టటం తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి రెబల్స్ తమకు మద్దతుగా నిలుస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చినా..వారి పైన చర్యలు తీసుకోవాలంటే టీడీపీ నుంచి వైసీపీకి మద్దతిచ్చిన వారి పైన చర్యలు తప్పవనేది టీడీపీ అంచనా. దీంతో..గెలిచినా ..గెలవకపోయినా ఎన్నికల బరిలో నిలవాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. దీంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు..జనసేన ఓటింగ్ సమన్వయం చేసుకోవటం పైన పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+