తాడిపత్రిలో దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. పోలీసులపై టీడీపీ నేత దీపక్ రెడ్డి ధ్వజం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇన్సిడెంట్‌లో పోలీసులే కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే, అతని కుమారుడు, అనుచరులు కత్తులు, కర్రలు, గొడ్డళ్లతో జే సీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు. గుంపులుగా వచ్చిన వైసీపీ శ్రేణులు.. జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.
Recommended Video

144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెప్పారని గుర్తుచేశారు. మరీ దాడిని ఎందుకు నిలువరించలేదని అడిగారు. అక్కడికి వచ్చిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే భార్య ఇసుకపై మామూళ్లు వసూలు చేస్తోందని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సింది అని చెప్పారు. నిజానిజాలు తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యే.. విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడితే పోలీసులు ఆయన్ని, అతని అనుచరులను వదిలేశారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసులు పెట్టడం సరికాదన్నారు.

దాడికి సంబంధించిన వీడియోల్లో ఎమ్మెల్యే, అతని అనుచరుల వీరంగం స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. వారికి పోలీసులు సహకరించారని అర్థమవుతుందన్నారు. హోం మంత్రి మాత్రం శాంతి చర్చలకు వెళ్లారని చెప్పడం ఏంటి అని నిలదీశారు. ఆయుధాలతో ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వెళ్లడం శాంతి చర్చలు ఎలా అవుతాయో హోం మంత్రి, జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఘటనను, అక్కడి పోలీసుల తీరుని సమర్థించినందుకు హోం మంత్రి తక్షణమే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రి ఘటన పోలీసుల ప్రమేయంతో జరిగిందని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని దీపక్ రెడ్డి తెలిపారు. దాడిని ప్రోత్సహించి, వైసీపీ వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications