అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ టీం సిద్దం : వార‌సుల‌కు టిక్కెట్ల వెనుక : నాడే ప్ర‌ణాళిక‌..నేడు అమ‌లు: బాబు వ్యూహాత్మ‌కం..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల అయింది. ఈ సారి జాబితా చంద్ర‌బాబు ఖ‌రారు చేసినా.. అం దులో లోకేష్ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు సైతం త‌న‌యుడి భ‌విష్య‌త్ కోసం వ్యూహాత్మ‌క అడుగు లు వేస్తున్నారు. లోకేష్ కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి త‌ర్ఫీదు ఇస్తున్న చంద్ర‌బాబు..ఇక‌..లోకేష్ కు ఓ స‌పోర్టింగ్ టీం ను సిద్దం చేస్తున్నారు. అందులో తొలి అడుగే కొత్త‌గా వార‌సుల‌కు అవ‌కాశం...

టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ? టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ?

క్ర‌మంలో లోకేష్ కు ప్రాధాన్య‌త‌..

క్ర‌మంలో లోకేష్ కు ప్రాధాన్య‌త‌..

త‌న వార‌సుడిగా లోకేష్ ను చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ప్ర‌మోట్ చేస్తున్నారు. తొలుత పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం ప‌ని చేయాల‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో టిడిపి విజ‌యం కోసం ప్ర‌చారం చేసారు. ఎన్నిక ల్లో టిడిపి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌రోక్షంగా పార్టీలో..ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు త‌రువాతి స్థాయికి ఎదిగేలా అడు గులు వేస్తున్నారు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా..పాలిట్ బ్యూరో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. ఇక‌, ప్ర‌భుత్వం. .పాల‌నా వ్య‌వ‌హారాల్లో సైతం అనుభ‌వం గ‌డించేందుకు త‌న క్యాబినెట్ లోనే మంత్రి గా చంద్రాబాబు కుమారుడు లోకేష్ కు అవ‌కాశం క‌ల్పించారు. దీని కోసం ఎమ్మెల్సీ ద్వారా చ‌ట్ట స‌భ‌ల‌కు పంపారు. ఇక‌, కీల‌క‌మైన పంచాయితీ రాజ్ శాఖ‌ను అప్ప‌గించ‌టం ద్వారా కింది స్థాయి ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు చేరువ‌య్యేలా చేసారు.

పార్టీలో..ప్ర‌భుత్వంలో రెండో స్థానంలో..

పార్టీలో..ప్ర‌భుత్వంలో రెండో స్థానంలో..

ఇక పార్టీలోనూ..ప్ర‌భుత్వంలోనూ లోకేష్ ఒక ర‌కంగా రెండో స్థానంలో ఉన్నారు. తొలుత లోకేష్ వ్య‌వ‌హార శైలి పై సీనియ‌ర్ల నుండి అసంతృప్తులు వ్య‌క్తం అయ్యేవి. ఆ త‌రువాత లోకేష్ ప‌ని తీరు లో పూర్తిగా మార్పు వ‌చ్చింది. పార్టీని..ప్ర‌భుత్వ వ్య‌వ హారాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వెళ్తున్నారు. సీనియ‌ర్ల విష‌యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కీల‌క విష‌యాల్లో లోకేష్ ప్రాధాన్య‌త‌కు ఉద్దేశ పూర్వకంగానే త‌గ్గిస్తూ ఇచ్చారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల స‌మ‌యం లో అనేక మంది ఆశావాహులు లోకేష్ ద్వారా త‌మ సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేసారు. లోకేష్ భ‌విష్య‌త్ రాజ‌కీయం కోసం ఈ సారి ఎన్నిక‌ల్లో కాదంటూనే చంద్ర‌బాబు ఆయ‌న‌కు స‌పోర్టింగ్ టీం ను సిద్దం చేస్తున్నారు. అందులో భాగం గానే వార‌సుల‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. ఈ టీం రెండేళ్ల క్రితం హైద‌రాబాద్‌లో జరిగిన మ‌హానాడు కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ద‌క్కించుకుంది.

బ‌రిలోకి లోకేష్ టీం ...

బ‌రిలోకి లోకేష్ టీం ...

ఈ సారి ఎన్నిక‌ల్లో లోకేష్ టీం బ‌రిలోకి దిగుతోంది. లోకేష్ తో పాటుగా ప‌లాస నుండి గౌతు శివాజీ కుమార్తె శిరీష్‌, చీపు రుప‌ల్లి నుండి మాజీ మంత్రి మృణాళిని కుమారుడు నాగార్జున‌, రాజ‌మండ్రి అర్బ‌న్ నుండి ఆదిరెడ్డి భ‌వానీ, గుడివాడ నుండి దేవినేని అవినాశ్‌, ప‌త్తికొండ నుండి కెఇ కుమారుడు శ్యాం, రాప్తాడు నుండి ప‌రిటాల త‌న‌యుడు శ్రీరాం, శ్రీకాళ హ‌స్తి నుండి బొజ్జ‌ల సుధీర్ రెడ్డి. న‌గ‌రి నుండి గాలి భానుప్ర‌శాక్ ఉన్నారు. వీరంతా లోకేష్ కు సన్నిహితులే. సీనియ‌ర్ల వారసులుగా వారు చంద్ర‌బాబు వార‌సుడికి మ‌ద్ద‌తు గా నిలిచే టీంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా లోకేష్ కు పూర్తి మ‌ద్ద‌తు గా ఈ టీం నిల‌వ‌నుంది. ఇక‌, పాల‌నా ప‌రంగానూ లోకేష్ ను తీర్చి దిద్ద‌ట‌మే ఇప్పుడు చంద్ర‌బాబు ఇప్పుడు ఉన్న ల‌క్ష్యం. పైకి సీనియ‌ర్ల వార‌సుల‌కు సీట్లు ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తున్నా..ఇదంతా లోకేష్ కు మ‌ద్ద‌తుగా సిద్దం అవుతున్న టీం అనేది విశ్లేష‌కుల అంచ‌నా.

EDUCATIONAL BACKGROUND OF ANDHRA PRADESH MLA'S

English summary
TDP Cheif Chandra babu Naidu stategically promoting nara Lokesh in party and Govt. Chandra Babu allocated tickets for young leaders which are in Lokesh team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X