ఆ ఇంటిని ఖాళీ చేయడం నైతిక బాధ్యత.. చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా : ఆర్కే
అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తిని అప్పగించాలనే విషయం చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఆ నైతిక బాధ్యత తనకు లేదా అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న ఇల్లు ప్రభుత్వానిదేనని 2016, మార్చి 2వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ఆయనే వెల్లడించారని గుర్తు చేశారు.
చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుటిల యత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఆర్‌డీఏ నోటీసుపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. లింగమనేని రమేష్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఓసారి సరిచూసుకోవాలని సూచించారు. 2016 సంవత్సరంలో తన ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు లింగమనేని చెప్పిన విషయం ఆర్కే గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా ఆ ఇల్లు తనదేనంటూ లింగమనేని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

లింగమనేనిని చంద్రబాబు అనేక రకాలుగా బెదిరించారని.. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు ఆర్కే. అయితే చంద్రబాబు ఉంటున్న ఇల్లు మీకు చెందిందా లేదంటే ప్రభుత్వానిదా అనే విషయం స్పష్టం చేయాలని కోరారు. ఏదిఏమైనా చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయకపోవడం మాత్రం సరైన పద్ధతి కాదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భవనాన్ని పట్టుకుని సొంత ఇల్లులా ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారని ప్రశ్నించారు. నైతిక బాధ్యతగా చంద్రబాబు తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications