అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సైకో.. అందుకే వేధింపులు, రఘురామ అరెస్ట్‌పై లోకేశ్, బాలినేని కౌంటర్

|
Google Oneindia TeluguNews

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ సీఎం జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనం అని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. జగన్ అసమర్థతను ఎత్తిచూపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణ రక్షణ గురించి పట్టించుకోకుండా, కక్ష తీర్చుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుంటున్న ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ తప్ప దేశంలో మరెవ్వరూ లేరన్నారు.

5 కోట్ల ఆంధ్రులకు విశ్వాసం లేదు..?

5 కోట్ల ఆంధ్రులకు విశ్వాసం లేదు..?

ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా కామెంట్స్ చేశారని రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారని తెలిపారు. జగన్ సర్కారుపై విశ్వాసం లేదని 5 కోట్ల ఆంధ్రులూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారని, మరి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు.

వై కేటగిరీ భద్రత, బైపాస్ సర్జరీ చేసిన వ్యక్తిపై ఇలానా

వై కేటగిరీ భద్రత, బైపాస్ సర్జరీ చేసిన వ్యక్తిపై ఇలానా

వై కేటగిరీ భద్రతలో ఉంటూ, ఇటీవలే బైపాస్ చికిత్స పొందిన సొంత పార్టీ ఎంపీని ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం జగన్ ఉన్మాదాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ ఇప్పుడు సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని లోకేశ్ సెటైర్లు వేశారు. ప్రశ్నిస్తే సీఐడీ అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం, లొంగకపోతే పీసీబీ తనిఖీలు... ఇదీ నియంత సైకో జగన్ పాలన అని విమర్శించారు.

Recommended Video

Raghurama Krishnam Raju బర్త్ డే రోజు అరెస్ట్.. Ys Jagan గట్టి దెబ్బ కొట్టాడు!! || Oneindia Telugu
బాలినేని కౌంటర్ అటాక్

బాలినేని కౌంటర్ అటాక్


వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. రఘురామకృష్ణరాజును ఓ సైకో అని అభివర్ణించారు. నాడు ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ కోసం అర్రులు చాచాడని, జగన్ బొమ్మతో గెలిచి, ఆపై ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జగన్ ఎంతో సహనం పాటించడం వల్లే రఘురామ ఇన్నాళ్లు రెచ్చిపోయాడని వెల్లడించారు. నేరుగా తననే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినా జగన్ భరించాడని వివరించారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందులో భాగంగానే రఘురామ అరెస్ట్ అని బాలినేని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు శిక్ష తప్పదన్నారు.

English summary
ys jagan is psycho cm nara lokesh alleged on raghurama krishna raju arrest issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X