Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పూర్తిగా అనంత‌పురం న‌గ‌ర‌పాల‌క సంస్థ తో ఏర్ప‌డింది. ఇక్క‌డి నుండి ఎమ్మె ల్యే గా గెలిచిన వారిలో న‌లుగురు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్ నేత అనంత వెంక‌ట‌రెడ్డి ఇక్క‌డి నుండి రెండు సార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత లోక్‌స‌భ‌కు గెలిచారు. ఆయ‌న కుమారుడు నాలుగు సార్లు అనంత‌పురం నుండి లోక్‌స‌భ కు ప్రాతినిధ్యం వ‌హించారు. త‌రిమెల నాగిరెడ్డి ఇక్క‌డి నుండి రెండు సార్లు అసెంబ్లీకి గెలిచారు. అనంత పురం లో కాంగ్రెస్ నేత బి నారాయ‌ణ రెడ్డి మూడు సార్లు గెలిచారు. ఆయ‌న సోద‌రుడు బి గుర్నాధ‌రెడ్డి 2009 ఎన్నిక‌ల్లో ఆ త‌రువాత 2012 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

15 సార్లు ఎన్నిక‌లు..
అనంత‌పురం అసెంబ్లీ నియోక‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ తొమ్మ‌ది సార్లు, టిడిపి మూడు సార్లు, సిపిఐ రెండు సార్లు , సిపిఎం ఒక‌సారి గెలుపొందింది. 2009 ఎన్నిక‌ల్లో బి నారాయ‌ణ రెడ్డి సోద‌రుడు బి గుర్నాధ‌రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌రువాత వైయ‌స్ మ‌ర‌ణంతో జ‌గ‌న్ తో క‌లిసి కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా వైసిపి లో చేరారు. 2012 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్దిగా మ‌హాలక్ష్మి శ్రీనివాసులు పై గెలుపొందారు . ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో నూ వైసిపి నుండి పోటీ చేసారు.

#AndhraPradeshElections2019: All about Anantapur Urban Constituency

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో అనంత‌పురం అర్బ‌న్ లో మొత్తం 252824 ఓట్లు ఉండ‌గా, అందులో 154328 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ప్ర‌భాక‌ర్ చౌద‌రి కి 74704 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన గుర్నాధ‌రెడ్డికి 65370 ఓట్లు ద‌క్కాయి. టిడిపి అభ్య‌ర్ది ప్ర‌భాక‌ర చౌద‌రి 9334 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల త‌రువాత వైసిపి నుండి పోటీ చేసిన గుర్నాధ‌రెడ్డి టిడిపి లో చేరారు. కానీ, టిడిపిలో నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చి ఇవ్వ‌క‌పోవ‌టంతో తిరిగి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+