ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: హిందూపూర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిలమత్తూరు మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. టిడిపి కి కంచుకో ట గా ఉన్న ఈ నియోజకవర్గంలో టిడిపి ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు ఇక్కడ ఓటమి ఎదుర్కోలేదు. టిడిపి వ్యవస్థా పక అధ్యక్షుడు..మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇక్కడి నుండి మూడు సార్లు గెలుపొందారు. రాష్ట్ర చరిత్రలో తొమ్మది చోట్ల పోటీ చేసి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన ఏకైక నేత ఎన్టీఆర్ గుడివాడలో రెండు సార్లు, తిరుపతిలో ఒకసారి, హిందూపూర్ లో మూడు సార్లు గెలిచారు. నల్గొండ..టెక్కలి లో ఒక్కోసారి గెలుపొందారు. మహబూబ్ నగర్ లో ఓడిపోయారు. హిందపూ పూర్ నుండి స్వాతంత్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు రెండు సార్లు, పి రంగనాయకులు రెండు సార్లు గెలుపొందా రు. ఎన్టీఆర్ తనయులు ఇద్దరు సైతం ఇక్కడి నుండి గెలిచారు. నందమూరి హరికృష్ణ 1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలవగా..2014 లో బాలకృష్ణ గెలిచారు.
16 సార్లు ఎన్నికలు..
హిందూపూర్ లో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి తొమ్మది సార్లు గెలు పొందింది. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుండి అబ్డుల్ గని స్వతంత్ర అభ్యర్ది నవీన్ నిశ్చల్ పై గెలుపొందారు. నవీన్ నిశ్చల్ 2004 లో కాంగ్రెస్ అభ్యర్దగా.. 2009 లో కాంగ్రెస్ అభ్యర్దిగా..2014 లో వైసిపి అభ్యర్దిగా పోటీ చేసి మూడు సార్లు పరాజయం చెందారు.

2014 లో బాలకృష్ణ గెలుపు..
2014 ఎన్నికల్లో హిందూపూర్ లో మొత్తం 208292 ఓట్లు ఉండగా, అందులో 159506 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన సినీ హీరో బాలకృష్ణ కు 81548 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ కు 65347 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది బాలకృష్ణ 16196 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శుల వ్యవహార శైలి కారణం తో ఇక్కడ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టిడిపి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని టిడిపి ని వీడి వైసిపి లో చేరారు.












Click it and Unblock the Notifications