ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తాడిపత్రి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దవడుగూరు మండలం ఈ నియోజకవర్గంలో కలిసింది. జెసి బ్రద ర్స్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం లో వారి కుటుంబే అత్యధికంగా ఇక్కడ గెలుస్తూ వచ్చింది. 1985 నుండి జెసి 2009 వనకు జెసి దివాకర్ రెడ్డి ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయన సోదరుడు జెసి ప్రభా కర్ రెడ్డి పొటీ చేసారు. చల్లా సుబ్బారాయుడు ఇక్కడి నుండి నాలుగు సార్లు గెలిచారు. ఆయన గతంలో పివి, జలగం క్యాబి నెట్ లలో మంత్రిగా పని చేసారు.ఇక్కడ నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జెసి దివాకర్ రెడ్డి చెన్నారెడ్డి, నేదురుమ ల్లి జనార్దనరెడ్డి, కోట్ల క్యాబినెట్ లలో మంత్రిగా పని చేసారు.
14 సార్లు ఎన్నికలు జరగ్గా..
తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పది సార్లు, టిడిపి రెండు సార్లు,కెఎమ్‌పిపి ఒకసారి గెలవగా, స్వతంత్ర అభ్యర్ది ఒకసారి గెలుపొందారు. 2014 లో రాష్ట్ర విభజన కారణంగా అప్పటి వరకు కాంగ్రెస్ నుండి వరుసగా గెలుస్తూ వస్తున్న జెసి దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుండి జెసి దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపిగా, సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. లోక్‌సభ అభ్యర్దిగా జెసికి ఇదే నియోజకవర్గంలో 20 వేలకు పైగా మెజార్టీ దక్కింది.

2014 ఎన్నికల్లో.. టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో తాడిపత్రి నియోకవర్గంలో మొత్తం 226651 ఓట్లు ఉండగా, అందులో 178721 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన జెసి ప్రభాకర రెడ్డికి 96740 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన రామిరెడ్డికి 74968 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది ప్రభాకర్ రెడ్డి 22172 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువా జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ తరహాలో టిడిపి లో హవా చూపించలేకపోయారు. దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి తో సన్నిహితంగా ఉంటూనే తన డిమాండ్ల సాధన కోసం అనేక సార్లు వివాదాస్పదం అయ్యారు.












Click it and Unblock the Notifications