ఘనంగా పరిటాల రవి-సునీతల కుమారుడి వివాహ రిసెప్షన్, లోకేష్ హాజరు
అనంతపురం: దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర, మాజీ మంత్రి సునీతల చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ వివాహ రిసెప్షన్ గురువారం రాత్రి ఘనంగా జరిగింది. రామగిరి మండలంలోని తిరుమల దేవరగుడి ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో సందడిగా మారింది.

ఘనంగా వివాహ రిసెప్షన్
కాగా, రిసెప్షన్ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పరిటాల సిద్ధార్థ-తేజస్విలను ఆశీర్వదించారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కూడా కుటుంబసభ్యులతోపాటు వచ్చి నవ వధూవరులకు ఆశీర్వచనాలు అందజేశారు. టీడీపీ నాయకులు, అభిమానులు వేలాదిగా వేడుకకు తరలివచ్చారు.

నేతల హాజరు..
గురువారం సాయంత్రం 6గంటలకు వెంకటాపురంలోని స్వగృహం నుంచి పరిటాల సిద్ధార్థ బయలుదేరారు. తండ్రి పరిటాల రవీంద్ర ఘాట్‌కు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు పల్లె రఘునాథ రెడ్డి, ఈరన్న, కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, శింగనమల ఇంఛార్జీ బండారు శ్రావణి, నేతలు ఆలం నరసానాయాడు, బీవీ వెంకటరాముడు, తదితరులు హాజరయ్యారు.
Recommended Video


అతిథులకు స్వాగతం పలికిన సునీత, శ్రీరామ్
కాగా, నవ వధువు తేజస్వి.. వెంకటాపురానికి వస్తూ శ్రీహరిపురంలో ఉన్న పరిటాల రవీంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివాహ వేదిక వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, తనయుడు శ్రీరామ్, కోడలు జ్ఞాన వేడుకకు వచ్చిన అతిథులకు సాదర స్వాగతం పలికారు. నాయకులు, అభిమానులు నవ వధూవరులను ఆశీర్వదించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications