బస్టాండ్‌లో సైకో బీభత్సం: మొబైల్ చోరీ చేసి, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేసి...

ఏపీలో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. మొబైల్ చోరీ చేయడమే గాక.. తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటికే ఆ సైకో నానా హంగామా చేశాడు. బస్టాండ్ పరిసరాల్లో అరచి, వస్తువులు ధ్వంసం చేసి భయాందోళనకు గురిచేశాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండులో నాని అనే సైకో మొబైల్ దొంగతనం చేశాడు. షాపు యజమాని, స్థానికులు పోలీసులకు అతడిని అప్పగించారు. దీంతో కోపోద్రిక్తుడైన నాని తన విశ్వరూపాన్ని అక్కడున్న ప్రయాణికులు, స్థానికులకు చూపించాడు. అవుట్ పోస్ట్‌లోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశాడు. అరుస్తూ, తిట్టుతుండటంతో అక్కడున్న వారు గజ గజ వణికిపోయారు. కొందరు అతని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.

psycho halchal in anantapur bus stand

వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు రంగంలోకి దిగారు. కానీ పోలీసులు అని కూడా భయపడలేదు. వారిని అసభ్యపదజాలంతో దూషించాడు. గాజు ముక్కతో తనకు తానే గాయాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ పోలీసులను కూడా భయాందోళనకు గురిచేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగింది, ఎందుకిలా ప్రవర్తించావు అనే అంశంపై క్షుణ్ణంగా విచారిస్తున్నారు. దొంగతనం ఎందుకు చేశావు, ఎందుకీలా ప్రవర్తించావు అనే అంశంపై ప్రశ్నిస్తున్నారు. యువకుడు క్షణికావేశంలో ఇలా ప్రవర్తించి ఉంటాడని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మానసిక నిపుణుడికి చూపించి, తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+