చొక్కా విప్పి.. జేసీ హల్‌చల్: వైసీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. కొద్దిరోజులుగా తనదైన స్టైల్‌లో నిరసన ప్రదర్శనలను వ్యక్తం చేస్తూ వస్తోన్న ఇవ్వాళ మరో అడుగు ముందుకేశారు. అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చారు. చొక్కా విప్పి హల్‌చల్ చేశారు. అక్కడితో ఆగలేదు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.

కొద్దిరోజులుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి- జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇసుక అక్రమ రవాణా, మున్సిపాలిటీలో డీజిల్ దుర్వినియోగం వంటి అంశాల మీద ఈ ఇద్దరు నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధం సాగుతోంది. అదికాస్తా ఫ్లెక్సీలపైకీ ఎక్కింది. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్‌ను ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టానుసారంగా, తన సొంత అవసరాల కోసం వాడుకుంటున్నాడంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. కొద్దిరోజులుగా తనదైన స్టైల్‌లో నిరసన ప్రదర్శనలను వ్యక్తం చేస్తూ వస్తోన్న ఇవ్వాళ మరో అడుగు ముందుకేశారు. అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చారు. చొక్కా విప్పి హల్‌చల్ చేశారు. అక్కడితో ఆగలేదు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.

 jc-

ఫలితంగా- మున్సిపాలిటీపై ఆర్థిక భారం పడుతోందని, దీనికి ఎవరు బాధ్యత వహించాలంటూ ప్రశ్నిస్తోన్నారు. వైసీపీ నాయకులు చేస్తోన్న డీజిల్ దుర్వినియోగం ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి తిప్పికొడుతున్నారు. వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ హయాంలో తాడిపత్రి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న డీజిల్ వినియోగానికి సంబంధించిన లెక్కలను వివరిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఈ ఫ్లెక్సీల వద్ద తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి హల్‌చల్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గజదొంగగా అభివర్ణించారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రచురించిన సమాచారం అంతా అబద్ధమంటూ ధ్వజమెత్తారు. కావాలంటే మున్సిపాలిటీ లెక్కలను బయటికి తీసి, ప్రజల ముందు పెడతానని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వీకరించాలని డిమాండ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉందా అని ప్రశ్నించారాయన.

తాను తాడిపత్రి ప్రజలను ఎప్పటికీ మోసం చేయనని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలకు మౌలిక వసతులను కల్పించడానికి సొంతంగా ఖర్చు పెట్టుకోగలనని, అంతే తప్ప ప్రజలను మోసగించనని అన్నారు. తాడిపత్రి ప్రజలు తన గుండెల్లో ఉన్నారంటూ చొక్కా విప్పి చూపించారు. తాడిపత్రి అని రాసివున్న పేపర్‌ను గుండె ఆకారంలో కత్తిరించి, దాన్ని తన కడుపుపై అతికించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+