సీఎం జగన్‌ను కలుస్తాం.. పోలీసుల తీరుపై పరిటాల సునీత ఆగ్రహాం
జిల్లా సమస్యలపై మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత గళమెత్తారు. నిన్న కలెక్టరేట్ వచ్చి తమ సమస్యల గురించి వివరించారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సీఎం జగన్‌ను కలుస్తామని అంటున్నారు. కలెక్టరేట్ వచ్చే సమయంలోనే అడుగుడుగునా అడ్డంకులు సృష్టించారని గుర్తుచేశారు. ఆపాలని చూశారని.. అయినా కలెక్టరేట్ వరకు వచ్చామన్నారు. ఇవాళ సీఎం జగన్‌ను కలుస్తాం అని చెప్పారు. జిల్లా రైతుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇవాళ జిల్లాకు సీఎం జగన్ రానున్నారు. ఆ క్రమంలోనే ఆయనను కలుస్తామని సునీత అంటున్నారు.

అమ్మ ఒడి, ఫించన్లు రద్దు చేస్తారట..
సీఎం జగన్ సభకు రాకపోతే.. అమ్మ ఒడి, పింఛన్లు రద్దు చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు. సత్యసాయి జిల్లాలో రైతు సమస్యలపై టీడీపీ ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చింది. పుట్టపర్తి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సునీత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతు సమస్యలపై కలెక్టరేట్‌కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక వాహనంలోనే వెళ్లాలని పోలీసులు సూచించగా.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కడికక్కడ అరెస్టులు
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు అనంతపురంలో హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఛలో కలెక్టరేట్‌కు వెళతారని ముందుగానే అలర్ట్ అయిన పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే .. పోలీసుల ద్వారా హక్కులను హరిస్తున్నారని ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించకుండా సీఎం జగన్ జిల్లాకు ఏ విధంగా వస్తారని.. ప్రజలకు సమధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే.. పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయడం సరికాదని ధ్వజమెత్తారు.

పోలీసు బలగాలు
జిల్లా కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కలెక్టరేట్‌కు వచ్చే అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తున్న వాహనాలను, వ్యక్తులను పోలీసులు నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రజల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని సునీత అంటున్నారు.

సీఎం జగన్ టూర్
సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.25 కు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. 10.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి 12.45 వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. వైఎస్సార్ ఉచిత పంటల భీమాను విడుదల చేస్తారు. జిల్లా అభివృద్ధిపై అధికారులకు నిర్దేశం చేస్తారు. ఈ నెల 17వ తేదీన కడప జిల్లాలో జగన్ పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications