వైఎస్ వివేకా హత్య కేసు: గంగాధర్ రెడ్డి మరణం అందువల్లే జరిగింది: అనంత ఎస్పీ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మరణంతో మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఇదీ అనుమానాస్పదం ఏమీ కాదని ఎస్పీ అంటున్నారు. అనారోగ్య సమస్యలే అని చెప్పారు. కానీ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గంగాధర్ రెడ్డి మృతి గురించి తెలిసి తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ మృతదేహాం పరిశీలించి అదేం లేదని తేల్చారు.
గంగాధర్ రెడ్డిది కడప జిల్లా పులివెందుల. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర రెడ్డికి ప్రధాన అనుచరుడు. అయితే పదేళ్ల క్రితమే పులివెందులను వీడి, అనంతపురం జిల్లా యాడికి వచ్చాడు. అక్కడే ఉంటున్నారు. బుధవారం రాత్రి తన ఇంటిలోనే నిద్రించిన గంగాధర్ రెడ్డి గురువారం తెల్లారేసరికి విగతజీవిగా కనిపించారు.

గంగాధర్ రెడ్డి మరణంపై అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటన విడుదల చేశారు. గంగాధర్ రెడ్డి మరణం అనుమానాస్పదమేమీ కాదని, అనారోగ్య సమస్యలతోనే మరణించారని ఎస్పీ వెల్లడించారు. గంగాధర్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరిపించామని, ఆయన మృత దేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని ఎస్పీ వెల్లడించారు. గంగాధర్ రెడ్డి మరణం అనారోగ్య కారణాలతోనే సంభవించిందని ఎస్పీ తెలిపారు
2019 మార్చి నెలలో ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. కడప కేంద్రంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కీలక డాక్యుమెంట్లను సీబీఐ సీజ్ చేశారు. కడప జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications