వామ్మో.. పాము... ఏపీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం...
అనంతపురం : పుట్టల్లో, చెట్లు, చేమల్లో ఉండాల్సిన పాములు జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో వాటిని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషసర్పాలు బయటకు రావడంతో భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఏపీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సాక్షాత్ ఏపీ మంత్రి బాధితులతో మాట్లాడుతుండగా అక్కడికొచ్చింది ఓ పాము. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు.

కలెక్టరేట్‌లో సర్పం
సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ మంత్రి శంకర్ నారాయణ వచ్చి .. ప్రజల గోడు వింటున్నారు. అయితే ఇంతలో అక్కడికి ఓ పాము కూడా వచ్చింది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి వద్దఆగింది. అయితే ఆ పామును చూసి ఆ వ్యక్తి గజ్జుమని వణికాడు. వెంటనే తన చెప్పును విసిరి పరుగెత్తాడు. పామును చూసి .. తననుతాను తప్పించుకొనేందుకు ఆ వ్యక్తి అలా చేశాడు. దీంతో మిగతావారు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ సర్పం నుంచి తప్పించుకునేందుకు వారు రకరకాల ఫీట్లు కూడా చేశారు.

ముందు ముందుకి ..
కానీ ఆ పాము మాత్రం అక్కడ ఉన్న జనంలోకి వచ్చింది. దీంతో అక్కడున్న మిగతా ప్రజలు వామ్మో అంటూ పరుగు తీశారు. ఓ వైపు పాము, మరోవైపు జనం పరుగులు తీయడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతలో మంత్రి సిబ్బంది కొందరు కలుగజేసుకున్నారు. మంత్రి శంకర్ నారాయణ‌్‌ను వెంటనే ప్రజల మధ్య నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. తర్వాత ఆ పాము రోడ్డుపై నుంచి పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న వారు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

పాము కలకలం
కలెక్టరేట్ కార్యాలయం వద్ద .. ప్రజలతో మంత్రి మాట్లాడుతుండగా పాము కలకలం రేపింది. దీంతో అక్కడున్న వారు భయంతో వణికిపోయారు. దీంతో జిల్లావ్యాప్తంగా పాము అంశం చర్చానీయాంశమైంది. మరోవైపు మంత్రి, ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై మంత్రి సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని చెప్తున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications