కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా కొత్త కేసులు 1,747.. మరణాలు, యాక్టివ్ కేసుల లెక్క ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 1747 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,50,339 కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 65,920 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు అధికారులు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో నమోదైన మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,223 కు చేరుకుంది. ఇక కరోనా మహమ్మారి బారినుండి గత 24 గంటల్లో 2,365 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ ల సంఖ్య 19,14,177 కు చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22,939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

1,747 Corona new cases in AP and the deaths, active cases are !!

Recommended Video

Covid-19 Third Wave లో భారత్ లో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం - ICMR | Oneindia Telugu

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే అనంతపురం జిల్లాలో 45 కేసులు, చిత్తూరు జిల్లాలో 293 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 86, వైఎస్ఆర్ కడప జిల్లాలో 54 , కృష్ణాజిల్లాలో 127, కర్నూలు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 239, ప్రకాశం జిల్లాలో 223, శ్రీకాకుళం జిల్లాలో 82 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 109 కేసులు, విజయనగరం జిల్లాలో 31 కేసులు , పశ్చిమ గోదావరి జిల్లాలో 215 కేసులు నమోదయినట్లు గా అధికారిక డేటా ద్వారా తెలుస్తుంది. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో అత్యల్ప కేసులు నమోదయ్యాయి.

English summary
The corona epidemic continues in the state of Andhra Pradesh. More than 1747 new corona positive cases have been reported in Andhra Pradesh in the wake of the ongoing corona second wave. In the last 24 hours, 1747 people have been infected with corona in AP. This brings the total number of corona victims in the state of Andhra Pradesh to 19,50,339.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X