తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 12 గంట‌లు..ఒక్క‌రోజే భారీ ఆదాయం..

తిరుమల వెళ్లే భ‌క్తులకు అల‌ర్ట్‌.. శ్రీ‌వారి ఆల‌యానికి భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆల‌య అధికారులు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో, తిరుమల శ్రీవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు.

మంగళవారం సాయంత్రం 6గంటల వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శన టోకెన్ లేని భక్తులకు 12గంటల దర్శన సమయం పడుతోంది. గత గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కంపార్ట్‌మెంట్‌లు అన్నీ భక్తులతో నిండిపోయి.. నాలుగు రోజుల పాటు భక్తులు రోడ్లపై రెండు కిలో మీటర్ల మేర నిలబడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు తిరుమలలో కనిపించడం లేదు.

12 hours for darshan of Tirumala Srivari One day huge income

తిరుమలలో నిన్న (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్లుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే దర్శన టోకెన్ లేని‌ భక్తులకు 12 గంటల దర్శన సమయం పట్ట‌గా, అయితే, తిరుపతిలో టైంస్లాట్‌ సర్వ దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం పూర్త‌యిపోయింది. ఇక‌, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్త‌వుతున్న‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు.

తిరుమలలో గదులు బుక్ చేసుకునేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. అలాగే, శుక్రవారం నుంచి సోమవారం వరకు శ్రీ‌వారిని సుమారు 3 లక్షల 25 వేల 526 మంది భక్తులు దర్శించుకున్నారు వీరంతా మొక్కుల రూపంలో శ్రీ‌వారికి త‌మ కానుక‌ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. లక్షా 53 వేల మంది భ‌క్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

అయితే, నిన్న (మంగ‌ళ‌వారం) ఒక్క రోజే 76, 381 మంది భక్తులు స్వామివారిని ద‌ర్శంచుకోగా, అందులో 33, 509 మంది భక్తులు తలనీలాలు సమర్పించి త‌మ మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉంటే కేవ‌లం నిన్న ఒక్క‌రోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు లభించిందని ఆల‌య అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+