వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. పులివెందులలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన వైఎస్ భాస్కర్ రెడ్డికి
సీబీఐ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. విజయనగర్ కాలనీలోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసంలో జడ్జి ఎదుట హజరు పరచగా భాస్కర్‌రెడ్డికి ఈనెల 29 వరకు( 14 రోజులు) రిమాండ్ విధించారు.
జడ్జికి భాస్కర్ రెడ్డి అనారోగ్యం గురించి చెప్పామని ఆయన తరఫు న్యాయవాదులు మీడియాకు చెప్పారు. వైద్యులిచ్చిన సర్టిఫికెట్లు జైలు సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని, వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు. అనంతరం అధికారులు భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీకివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదులకు జడ్జి నోటీసులు జారీచేశారు. వీరు సోమవారం కౌంటర్ పిటిషన్ వేయనున్నారు. భాస్కర్ రెడ్డి పరారయ్యే అవకాశముందని, అందుకే తాము అరెస్ట్ చేశామని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.












Click it and Unblock the Notifications