ఉత్తరాంధ్రలో 14 రైళ్ల టైమింగ్స్ మార్పు..! స్టేషన్ల వారీగా ఇలా..!

దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast railway) పరిధిలో ప్రయాణించే పలు రైళ్ల (Trains) సమయాల్లో త్వరలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా రాకపోకలు సాగించే 14 రైళ్ల సమయాలు మారబోతున్నాయి. జిల్లాలోని పలాస, ఇచ్చాపురం, సోంపేట స్టేషన్లలో ఈ మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పులు క్రమంగా అమల్లోకి రాబోతున్నాయి. దీని ప్రకారం ఏయే రైళ్లకు ఏయే స్టేషన్లలో టైమింగ్స్ మార్పులు జరగనున్నాయో ఓసారి చూద్దాం..

మచిలీపట్నం-కర్నాటక ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఈ రెండు రైళ్లు..!
మచిలీపట్నం-కర్నాటక ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఈ రెండు రైళ్లు..!

పలాసలో 15227 నంబర్ SMVT బెంగళూరు-ముజఫర్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి 12.38కు వస్తుండగా.. అక్టోబర్ 17 నుంచి ఇది 12:26కి మారనుంది. అలాగే 18064 యలహంక-సంత్రాగచ్చి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6 గంటలకు వస్తుండగా.. ఇది అక్టోబర్ 17 నుంచి ఉదయం 5:35కు మారనుంది. 22888 SMVT బెంగళూరు-హౌరా వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ఉదయం 7:35కు వస్తుండగా అక్టోబర్ 15 నుంచి 7:02కు మారనుంది. అలాగే 12503 SMVT బెంగళూరు-అగర్తలా బై-వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఉదయం 07:35కు వస్తుండగా.. అక్టోబర్ 20 నుంచి 7:03కు మారనుంది.

14 Trains to Get New Timings at Palasa From October 15 Check Full List
పల్నాడులో ఆ ఉద్యోగుల రైలుకు హాల్ట్ ఖరారు- ఆ రోజు నుంచే-టైమింగ్స్ ఇవే..!
పల్నాడులో ఆ ఉద్యోగుల రైలుకు హాల్ట్ ఖరారు- ఆ రోజు నుంచే-టైమింగ్స్ ఇవే..!

అలాగే 16597 SMVT బెంగళూరు-అలీపుర్‌దువార్ వీక్లీ అమృత్ భారత్ ఉదయం 7:35కు వస్తుండగా.. అక్టోబర్ 17 నుంచి 7:03కు రానుంది. 16523 SMVT బెంగళూరు-బాలుర్‌ఘాట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 07:35కు వస్తుండగా.. అక్టోబర్ 21 నుంచి 7:03కు రానుంది. 12864 SMVT బెంగళూరు-హౌరా డైలీ సూపర్‌ఫాస్ట్ ఉదయం 08:10కి వస్తుండగా.. అక్టోబర్ 15నుంచి 7:38కి రానుంది.
18048 వాస్కోడగామా-షాలిమార్ అమరావతి ఎక్స్‌ప్రెస్ ఉదయం 11:43కు వస్తుండగా.. అక్టోబర్ 20 నుంచి 11:30కు రానుంది.
12846 SMVT బెంగళూరు-భువనేశ్వర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ మధ్యాహ్నం 1:58కి వస్తుండగా.. అక్టోబర్ 19 నుంచి 1:36కి రానుంది.
22834 SMVT బెంగళూరు-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1:58కు వస్తుండగా.. అక్టోబర్ 15 నుంచి 1:36కి రానుంది.

14 Trains to Get New Timings at Palasa From October 15 Check Full List

అలాగే 16223 SMVT బెంగళూరు-రాధికాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ పలాసలో మధ్యాహ్నం2.18కి వస్తుండగా.. అక్టోబర్ 15 నుంచి 2 గంటలకే రానుంది. ఇదే రైలు సోంపేటలో ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటలకు వస్తుండగా.. అక్టోబర్ 15 నుంచి 2.23కు రానుంది. ఇచ్చాపురంలో ప్రస్తుతం మధ్యాహ్నం 3.20కు వస్తుండగా.. అక్టోబర్ 15 నుంచి 2.36కే రానుంది. ఇక 18464 KSR బెంగళూరు-భువనేశ్వర్ డైలీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 15 నుంచి పలాసకు 2.26కు, సోంపేటకు 2.49కి, ఇచ్చాపురానికి 3.04కు రానుంది. 22884యశ్వంత్‌పూర్-పూరీ వీక్లీ గరీబ్ రథ్ పలాసకు రాత్రి 11.26కు వస్తుండగా.. అక్టోబర్ 17 నుంచి రాత్రి 11.5కు రానుంది. అలాగే 22818 మైసూరు-హౌరా వీక్లీ సూపర్‌ఫాస్ట్ ప్రస్తుతం రాత్రి 11.48కి వస్తుండగా.. అక్టోబర్ 18 నుంచి 11.27కే రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+