Revised Train Timings: శ్రీకాకుళం జిల్లాలో 5 ఎక్స్ ప్రెస్ రైళ్లకు టైమింగ్స్ మార్పు- ఈ స్టేషన్లలో..!

తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని మూడు స్టేషన్లలో త్వరలో 5 రైళ్లకు హాల్ట్ టైమింగ్స్ మారబోతున్నాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చేలా అధికారులు ఈ మార్పుల్ని ప్రకటించారు. ఇలా టైమింగ్స్ మారబోతున్న (Revised Train Timings) స్టేషన్లలో సోంపేట, ఇచ్చాఫురం, మందస ఉన్నాయి. వీటిలో సమయాలు మారుతున్న రైళ్లలో హీరాఖండ్ ఎక్స్ ప్రెస్, గునుపూర్- పూరీ ఎక్స్ ప్రెస్, పూరీ-అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్, ప్రశాంతి ఎక్స్ ప్రెస్, జునాగఢ్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ ఉన్నాయి.

వీటిలో ముందుగా గునుపూర్-పూరీ ఎక్స్ ప్రెస్ (18418)కు సోంపేట, ఇచ్చాఫురం, మందస స్టేషన్లలో హాల్ట్ టైమింగ్స్ మారుతున్నాయి. సోంపేటలో గునుపూర్-పూరీ ఎక్స్ ప్రెస్ హాల్ట్ టైమ్ ఇప్పటివరకూ ఉదయం 8.56 ఉండగా.. ఇది కాస్తా 8.38కి మారింది. అలాగే ఇదే రైలుకు ఇచ్చాపురంలో ఉదయం 9.09కి హాల్ట్ ఉండగా.. దీన్ని 8.51కి మార్చారు. అలాగే మందసలో ప్రస్తుతం 8.43 ఉండగా.. దీన్ని 8.25కు మార్చారు. ఈ మూడు మార్పులు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

Railway Passengers Alert Revised Train Timings Announced for Sompeta Ichchapuram Mandasa

హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ (18448)కు సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లలో హాల్ట్ టైమింగ్స్ మారాయి. ప్రస్తుతం ఈ రైలు సోంపేటకు తెల్లవారు జామున 4.09కు వస్తుండగా.. దీన్ని 3.48కి మార్చారు. అలాగే ఇచ్ఛాపురం స్టేషన్ కు 4.24కు వస్తుండగా.. దీన్ని 4.04కు మార్చారు. ఈ రైలు సమయాల మార్పులు కూడా అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే పూరీ-అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ (12844)రైలుకు కూడా సోంపేట, ఇచ్చాపురంలో టైమింగ్స్ మారాయి. సోంపేటలో ఈ రైలు తెల్లవారు జామున 3.08కు వస్తుండగా.. దీన్ని 3.20కు మార్చారు. ఇచ్ఛాపురంలో 3.58కి వస్తుండగా.. 3.32కు మార్చారు. ఈ రైలు సమయాలు అక్టోబర్ 19న మారతాయి.

Railway Passengers Alert Revised Train Timings Announced for Sompeta Ichchapuram Mandasa

ఇక ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు (18464)కు కూడా సోంపేట, ఇచ్చాపురంలో టైమింగ్స్ మార్చారు. సోంపేటలో ఇది మధ్యాహ్నం 3.08కి వస్తుండగా.. దీన్ని 2.49కి మార్చారు. ఇచ్చాపురంలో 3.19కి వస్తుండగా.. దీన్ని 3.04కు మార్చారు. చివరిగా జునాగఢ్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ (20838)కి ఇచ్చాపురంలో టైమ్ మారింది. ప్రస్తుతం ఇది ఇచ్చాపురానికి తెల్లవారు జామున 1.59కి వస్తుండగా.. దీన్ని 1.36కు మార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+