Rayagada–Guntur Express: రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్పు..!
గుంటూరు-రాయగడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ ఓ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కారణాల వల్ల గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (Rayagada-Guntur Express) రైలు రాకపోకల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ రైలు ప్రయాణ మార్గంలో రెండు స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ ను మారుస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు వీటిని గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రాయగడ నుంచి గుంటూరుకు బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17244 టైమింగ్స్ లో ఈ మార్పు చోటు చేసుకుంది. రాయగడ స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలును ఇకపై 2.50కే బయలుదేరేలా మార్పు చేశారు. అలాగే జిమిడిపేట స్టేషన్లో ఈ రైలు మధ్యాహ్నం 3.16కు చేరుకోవాల్సి ఉండగా.. ఇకపై దీన్ని 3.06కు అంటే 10 నిమిషాల ముందుగా వచ్చేలా మార్పు చేశారు. దీంతో జిమిడిపేట స్టేషన్లో బయలుదేరాల్సిన సమయం కూడా 3.18 నుంచి 3.08కి మారింది. ఈ మార్పులు ఆగస్టు 24 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) అధికారులు ప్రకటించారు.

గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంది. ఇప్పటివరకూ రాయగడలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 4.50కు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. ఏపీ, ఒడిషా రాష్ట్రాల్ని కలిపే ముఖ్యమైన రైలు ఇది. ఈ రైలు ప్రయాణించే రూటులో దాదాపు 30 హాల్ట్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి రాయగడ నుంచి గుంటూరు వచ్చే రైలుకు మాత్రమే ఈ టైమింగ్స్ లో మార్పు చేశారు. గుంటూరు-రాయగడ రైలులో ఎలాంటి మార్పు లేదు.














Click it and Unblock the Notifications