సొరకాయతో వడలు ఇలా చేస్తే బెస్ట్!

ప్రతీరోజూ ఉదయం ఇడ్లీ, దోశ వంటి రొటీన్ టిఫిన్స్ తిని బోర్ కొట్టిందా? అయితే కేవలం పది నిమిషాలలో ఎంతో రుచికరంగా, పైకి కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండే 'సోరకాయ రవ్వ వడ'ను టేస్ట్ చెయ్యండి . ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సొరకాయ మరియు రవ్వతో చేసే ఈ అల్పాహారం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఈ బ్రేక్ ఫాస్ట్ తయారీకి ప్రధానంగా ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు సన్నగా తురిమిన సొరకాయ తురుము, తరిగిపెట్టిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొద్దిగా జీలకర్ర, సన్నని కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు మరియు నూనె అవసరం ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకుని, అందులో తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేయాలి.

Crispy Sorakaya Rava Vada Recipe know the preparation of 10-Minute Bottle Gourd Suji Breakfast

సొరకాయలో సహజంగానే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ తడి సరిపోతుంది. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చల్లుకుంటూ వడల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర మరియు చిటికెడు కారం వేసి బాగా కలపాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా వడలు తట్టుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి.

స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె పోసి వేడెక్కనివ్వాలి. చేతికి కొద్దిగా నూనె లేదా నీరు రాసుకుని, కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా తీసుకుని వడలా ఒత్తుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఒత్తుకున్న వడలను నూనెలో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

దొండకాయ ఆవకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే పండుగే!
దొండకాయ ఆవకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే పండుగే!

ఇలా వేయించుకున్న కరకరలాడే సొరకాయ రవ్వ వడలను వేడివేడిగా పల్లి చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే ఆ రుచే వేరు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కే కాకుండా ఈవెనింగ్ స్నాక్స్‌గా కూడా ఇది చక్కటి ఎంపికగా చెప్పవచ్చు. నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా చాలా త్వరగా తయారయ్యే ఈ వడలను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వాటి రుచిని కుటుంబంతో కలిసి ఆస్వాదించండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+