ఏపీలో 1435 కొత్త కరోనా కేసులు: స్వల్పంగా పెరిగిన రికవరీ, 15వేలకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా తగ్గినట్లే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 66,173 నమూనాలను పరీక్షించగా.. 1435 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 13 మంది మృతి

ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 13 మంది మృతి

తాజాగా నమోదైన 1435 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,038కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 13 మంది మృతి చెందారు. అత్యధికంగా కృష్ణాలో నలుగురు మరణించగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం ఒక్కొక్కరు మృతి చెందారు.

దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,715 మృతి చెందారు.

ఏపీలో 15,141 యాక్టివ్ కేసులు

ఏపీలో 15,141 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1535 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,72,399కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 15,141 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,60,34,217 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 198 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు జిల్లాలో 15 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 17, చిత్తూరులో 171, తూర్పుగోదావరిలో 182, గుంటూరులో 101, కడపలో 23, కృష్ణాలో 136, కర్నూలులో 15, నెల్లూరులో 198, ప్రకాశంలో 113, శ్రీకాకుళంలో 33, విశాఖపట్నంలో 58, విజయనగరంలో 47, పశ్చిమగోదావరిలో 123 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,83,814, చిత్తూరులో 2,36,154 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,039) కరోనా కేసులున్నాయి.

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే

ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. నిన్నటితో పోలిస్తే కాస్త కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తుంది. తాజాగా 5.7 శాతం మేర కొత్త కేసులు తగ్గినట్లుగా సమాచారం. భారతదేశంలో గత 24 గంటల్లో 34,457 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 400 దిగువకు మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3.23 కోట్ల మార్కును దాటగా, యాక్టివ్ కేసులు 3,61,340 గా నమోదయింది. గత 24 గంటల్లో 375 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన మరణాల సంఖ్య 4.33 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారి నుంచి 36 వేల మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ ను జయించిన వారి సంఖ్య 3.15 కోట్లకు పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనా నిర్ధారణ పరీక్షలను 17,21,205 మందికి నిర్వహించారు. ఇదిలా ఉంటే క్రియాశీల కేసుల రేటు 1.12 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.54 శాతంగా ఉంది. మరోపక్క నిన్న ఒక రోజు 36.36 లక్షల మంది కరోనా ను నియంత్రించడానికి కోవిడ్ వాక్సినేషన్ చేయించుకున్నారు.

దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పంపిణీ అయిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 57,61,17,350 కి చేరుకుంది. ఇక వివిధ రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే నమోదైన కరోనా కేసులు వివరాలు చూస్తే టాప్ 10 రాష్ట్రాలుగా నిన్న నమోదైన రాష్ట్రాలలో పరిస్థితి ఇలా ఉంది. దేశంలోనే అత్యధికంగా రోజువారి కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 20,224 కరోనా కేసులు నమోదయ్యాయి, 99 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 4,365 కరోనా కేసు నమోదు కాగా 105 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో 1,668 మందికి కరోనా సోకగా 24 మంది కరోనా కారణంగా మృతి చెందారు . కర్ణాటక రాష్ట్రంలో 1,453 కరోనా కేసు నమోదు కాగా 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇక, తర్వాతి స్థానంలో ఒడిశా నిలిచింది. ఒడిశా రాష్ట్రంలో 986 కరోనా కేసులు నమోదు కాగా 69 మంది కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఆపై అస్సాంలో 708 కరోనా కేసులు నమోదయ్యాయి, 13 మంది మరణించారు. తర్వాతి స్థానంలో మిజోరాంలో 522 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు మహమ్మారికి బలయ్యారు. ఆ తర్వాత మణిపూర్లో 372 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. ఆపై తెలంగాణ రాష్ట్రంలో 359 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+