విజయనగరం జిల్లాలో దారుణం- 20 ఏళ్ల యువతి కాళ్లూ చేతులు కట్టేసి
విజయనగరం జిల్లాలో ఇవాళ ఓ దారుణం చోటు చేసుకుంది. దిశ చట్టం అమల్లోకి వచ్చిన రాష్ట్రంలో యువతులకు రక్షణ లేదని ఈ ఘటన నిరూపించింది. గుర్ల మండలంలో పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే చోటు చేసుకున్న ఈ ఘటనపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న తోటలో ఓ 20 ఏళ్ల యువతి తాళ్లతో కట్టేసి ఉండటాన్ని స్ధానికులు గుర్తించారు. అపస్మారక స్ధితిలో ఉన్న ఆమెను మొహంపై నీళ్లు చల్లి లేపారు. వివరాలు అడిగినా చెప్పలేకపోతుండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతి కావడం, పట్టపగలే తాళ్లతో కట్టేసి ఉండటంతో ఏం జరిగిందనే దానిపై ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్ధితి నెలకొంది.

చివరికి ప్రాధమిక విచారణలో ఈ యువతిది తెర్లాం మండలం లోచర్ల గ్రామంగా గుర్తించారు. ఆమె వద్ద నున్న వివరాల ఆధారంగా విజయనగరం ఎస్‌కే డిగ్రీ కళాశాలలో ఆమె చదువుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమె పేరు రమగా గుర్తించారు. ఆదివారం రాత్రి దుండగులు ఆమెను చేతులు, కాళ్లూ కట్టేసి అక్కడ పడేసినట్లు తెలుసుకున్నారు. మిగతా వివరాలు తేల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులకు వివరాలు అందించి రప్పించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications