ఏపీ సచివాలయాల్లో కేంద్ర ప్రభుత్వ సేవలు-కొత్తగా 200 సర్వీసులు-పాన్, పాస్ పోర్టు కూడా
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 543 సేవల్ని అందిస్తున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో పాన్ కార్డు, పాస్ పోర్టు, ఆధార్ తో పాటు మొత్తం 200 సేవల్ని సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారం కల్లా ఈ సేవలన్నీ సచివాలయాల్లో లభిస్తాయి. దీంతో జనం బ్యాంకులు, పాస్ పోర్టు కేంద్రాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది..

సచివాలయాలపై కీలక నిర్ణయం
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల చెంతకు చేర్చే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్ని మరింత బలోపేతం చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సచివాలయాల్లో అందుబాటులో ఉన్న సేవల నాణ్యత పెంచడంతో పాటు మరిన్ని సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో ఉద్యోగుల జవాబుదారీ తనం పెంచడంతో పాటు బయోమెట్రిక్ హాజరునూ తప్పనిసరి చేసింది.

త్వరలో మరో 200 సేవలు
ఏపీ సచివాలయాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 543 సేవల్ని అందిస్తున్నారు ఇందులో సర్టిఫికెట్ల జారీ, అనుమతి పత్రాలు, రేషన్ కార్డులు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు మరో 200 సేవల్ని త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో ఇప్పటివరకూ ప్రజలకు అందుబాటులో లేని పలు కీలక సేవలు ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వచ్చే జనం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగే ఆగత్యం తప్పుతుందని అధికారులు చెప్తున్నారు.

సచివాలయాల్లో పాన్ కార్డు, పాస్ పోర్టు
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో వైసీపీ సర్కార్ త్వరలో అందుబాటులోకి తెస్తున్న సేవల్లో పలు కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా ఉండబోతున్నాయి. ఇందులో పాన్ కార్డు, పాస్ పోర్డు, ఆధార్, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్ సేవలు కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకూ వీటి కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాలు, బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులకు తిరిగిన జనానికి ఇవన్నీ ఒకే చోట అందుబాటులోకి రావడం భారీ ఊరట కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న 15 వేల సచివాలయాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. అలాగే 500 సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

వన్ స్టాప్ సొల్యూషన్ గా సచివాలయాలు
ఏపీలో ప్రభుత్వ సేవలకు వేదికగా ఉన్న సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సేవల్ని కూడా చేర్చడం వల్ల ప్రజలకు ఇదో వన్ స్టాప్ సొల్యూషన్ గా మారే అవకాశముంది. ఇప్పటివరకూ పాస్ పోర్టు వంటి సేవలు అందుబాటులోకి లేని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు సైతం ఇవి అందుబాటులోకి వస్తే ఇక జనం ఇతర చోట్లకు వెళ్లి వీటిని పొందాల్సిన అవసరం ఉండదు.
ఇందుకోసం ప్రభుత్వం ప్రతీ సచివాలయానికీ ఇంటర్నెట్ సదుపాయంతో పాటు ప్రింటర్లు, స్కానర్లు వంటి లాజిస్టిక్స్ సదుపాయాలను అందిస్తోంది. వీటిని వాడుకుంటూ మారుమూల గ్రామాల్లో సైతం సచివాలయాలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications