ఏపీలో కొత్తగా 2287 కరోనా కేసులు... మరో 18 మంది మృతి....

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,68,462కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,395కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,019 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 2430 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ 19,34,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 410 కేసులు, చిత్తూరు377, కృష్ణా జిల్లాలో 299 కేసులు అత్యల్పంగా విజయనగరంలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి.కోవిడ్ కారణంగా తాజాగా సంభవించిన మరణాల్లో చిత్తూరులో నలుగురు,కృష్ణా,నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున,ప్రకాశంలో ఇద్దరు,గుంటూరు,కర్నూలు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 85,856 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటివరకూ 2,46,48,899 శాంపిల్స్‌ను పరీక్షించారు.

 2287 new covid cases and 18 deaths reported in andhra pradesh

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను అగస్టు 14 వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొవిడ్-19 ప్రోటోకాల్స్ అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.

Recommended Video

    Corona virus third wave myth Buster | Oneindia Telugu

    ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 541 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 225,కేరళలో 80 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,16,55,824కి చేరింది. మరణాల సంఖ్య 4,24,351కి చేరింది. ప్రస్తుతం 4,10,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 39,258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.36శాతంగా ఉంది.ఇప్పటివరకూ 47,02,98,596 మందికి వ్యాక్సిన్లు వేశారు. శనివారం(జులై 31) ఒక్కరోజే 60లక్షల పైచిలుకు మందికి వ్యాక్సిన్లు వేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+