ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అత్యల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, భారీ సంఖ్యలో మాత్రం పాజటివ్ కేసులు రావడం లేదు. భారీ సంఖ్యలో పరీక్షలు చేసినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు 3వేలకు మించడం లేదు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది.

గడిచిన 24 గంటల్లో 85,364 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 2745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,35,953కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 13 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6757కు చేరింది.

2745 new corona positive cases reported in Andhra Pradesh and 13 deaths

జిల్లాల వారీగా మరణాల సంఖ్యను గమనించినట్లయితే.. కృష్ణాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులను పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 218, చిత్తూరులో 286, తూర్పుగోదావరిలో 407, గుంటూరులో 297, కడపలో 125, కృష్ణాలో 398, కర్నూలులో 38, నెల్లూరులో 130, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 91, విశాఖపట్నం 120, విజయనగరం 83, పశ్చిమగోదావరిలో 428 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఒక్క రోజు వ్యవధిలో 2292 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 8,04,423కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,878 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 84,27,629 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యశాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+