ఏపీలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, కర్నూలులో అల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ అంతకుమించి కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఉండటం గమనార్హం. మరణాల రేటు కూడా తగ్గింది.

గత 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2849 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,30,731కి చేరింది. తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 6734కు చేరింది.

2849 new corona positive cases reported in Andhra Pradesh and 15 deaths

కరోనా కారణంగా జిల్లాలవారీగా మరణాలను గమనించినట్లయితే.. అనంతపురంలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు.

గత 24 గంటల్లో 3700 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 7,99,430కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,672 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 82,66,800 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీ జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 142, చిత్తూరులో 436, తూర్పుగోదావరిలో 394, గుంటూరులో 277, కడపలో 169, కృష్ణాలో 421, కర్నూలులో 35, నెల్లూరులో 93, ప్రకాశంలో 185, శ్రీకాకుళంలో 88, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 78, పశ్చిమగోదావరి 386 కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+