ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 33వేలకు యాక్టివ్ కేసులు, తగ్గిన టెస్టులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, కొత్తగా ముందు రోజుకంటే కరోనా కేసులు తాజాగా పెరిగాయి. మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,378 నమూనాలను పరీక్షించగా.. 3042 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 3042 కరోనా కేసులు, 28 మరణాలు
తాజాగా నమోదైన 3042 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,08,065కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 28 మంది మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఏడుగురు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, కడపలో ముగ్గురు, అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 12,898 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 33వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3,748 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,61,932కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 33,230 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,25,24,187 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 665 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 51 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 91, చిత్తూరులో 358, తూర్పుగోదావరిలో 665, గుంటూరులో 277, కడపలో 79, కృష్ణాలో 252, కర్నూలులో 51, నెల్లూరులో 251, ప్రకాశంలో 310, శ్రీకాకుళంలో 116, విశాఖపట్నంలో 171, విజయనగరంలో 61, పశ్చిమగోదావరిలో 360 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,66,988, చిత్తూరులో 2,22,639 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications