కిడ్నీనా .. రాళ్ళ గనినా? మూత్రపిండంలో 3వేల రాళ్ళు వెనకేసిన ఏపీ వాసి..తొలగించిన వైద్యులు!!

పదులు , వందలు కాదు ఏకంగా కిడ్నీలో మూడు వేల రాళ్ళను కలిగి ఉన్న ఒక వృద్దుడికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు.

సాధారణంగా కిడ్నీలో రాళ్లు ఉంటే మహా అయితే పదుల సంఖ్యలో రాళ్లు ఉంటాయేమో.. ఇంకా గొప్పగా ఉంటే మహా అయితే వందల సంఖ్యలో రాళ్ళు బయటకు తీసిన ఘటనలు విన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వృద్ధుడు మూత్రపిండాలలో రాళ్ల గనే ఉంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక వృద్ధుడు మూత్రపిండంలో చిన్నా, పెద్ద రాళ్లు మొత్తం కలిపి మూడువేల రాళ్లు ఉన్నాయన్న వార్త విన్న ప్రతీ ఒక్కరు ఆయన ఎన్ని రాళ్లు వెనకేసుకున్నాడో అని మాట్లాడుకుంటున్నారు.

ఇంతకు ఈ ఘటన వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలానికి చెందిన ఓ వృద్ధుడు మూత్రపిండంలో రాళ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. మూత్రపిండాలలో రాళ్ళ కారణంగా తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఆయనను వైద్యులు పరిశీలించి, ఆపై ఆ వృద్ధుడికి శస్త్ర చికిత్స చేసి రాళ్లను తొలగించారు యూరాలజీ నిపుణుడు డాక్టర్ టి సనత్ రెడ్డి. ఆ వృద్ధుడి మూత్రపిండంలో ఉన్న రాళ్లు చూసి వైద్యుడే షాక్ అయ్యాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

3000 kidney stones removed by doctors in AP annamayya district!!

ఏకంగా వృద్ధుడి మూత్రపిండంలో మూడు వేల పెద్ద చిన్న రాళ్లు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. డాక్టర్ పావనితో కలిసి శస్త్ర చికిత్స నిర్వహించిన ఆయన చాలా అరుదైన కేసుగా ఈ కేసు గురించి వెల్లడించారు. కుట్లు వేసే అవసరం లేకుండా కీ హోల్ సర్జరీ ద్వారా 3 వేల రాళ్లను తొలగించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో రాళ్లు బయటపడడం అరుదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్టుగా తెలిపారు.

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలి అంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. పాలు, పెరుగు లాంటి వాటిని తీసుకోవాలని చెబుతున్నారు. ఉప్పు తక్కువగా తినాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలలో రాళ్ళను వెనకేసుకునే అవసరం ఉండదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+