రూ.40 లక్షల పన్ను ఎగ్గొట్టిన జగన్ కంపెనీ? మరిన్ని తెలుగు సంస్థలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారీ ఆదాయం ఉన్న కంపెనీలకు అందించే ప్రోత్సాహకాలను అడ్డం పెట్టుకొని కొన్ని కంపెనీలు అవకతవకలకు పాల్పడుతూ ఆదాయ పన్ను ఎగవేస్తున్నట్లు కాగ్ గుర్తించింది.

బ్రహ్మానందరెడ్డి గెలుపుపై భార్య: నీకేం అవసరం.. శిల్పాపై అఖిలప్రియ

అలాంటి సంస్థల్లో వైసిపి అధినేత జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరికొన్ని కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. భారతి సిమెంట్స్ రూ.40 లక్షల ఆదాయ పన్ను (ఐటీ) చెల్లించలేదని తెలుస్తోంది.

కేంద్రం నివేదిక

కేంద్రం నివేదిక

2012-13 నుంచి 2015-16 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీల ఆధాయ పన్ను చెల్లింపుపై కాగ్ రూపొందించిన నివేదికను కేంద్రం పార్లమెంటుకు సమర్పించింది.

ఆదాయపన్ను

ఆదాయపన్ను

సాధారణంగా భారీ ఆదాయం కలిగిన కంపెనీలు తమ వాటాదారులకు డివిడెంట్ల రూపంలో ఆదాయాన్ని పంపిణీ చేస్తే 2001 ఆర్థిక చట్టంలోని 115 బిజె సెక్షన్ ప్రకారం పాక్షికంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కనీస ప్రత్యామ్నాయ పన్ను.

YS Jagan Tongue Slip Video Trolled By TDP | Oneindia Telugu
భారతీ సిమెంట్స్ ఇలా

భారతీ సిమెంట్స్ ఇలా

ఆ సెక్షన్‌ను ఉపయోగించుకొని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఆదాయపన్ను ఎగవేస్తున్నాయని కాగ్ గుర్తించింది. తమ కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయంటూ భారతీ సిమెంట్ కొంత ఆదాయ మొత్తాన్ని లాభాల్లో చేర్చలేదని అంటున్నారు.

రూ.40 లక్షలకు పైగా

రూ.40 లక్షలకు పైగా

తద్వారా రూ.40 లక్షలకు పైగా ఆదాయాన్ని చెల్లించలేదని కాగ్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో పన్ను చెల్లించలేదని తెలుస్తోంది. మరోవైపు, 33 శాతం కంపెనీలు ఇన్‌కం ట్యాక్స్ డాటాబేస్‌లో లేవని కూడా కాగ్ తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Government auditor CAG today said that about a third of the firms listed with the Registrar of Companies (RoC) were not in the database of the Income Tax Department.
Please Wait while comments are loading...