ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: తగ్గిన మరణాలు, రికవరీ, జిల్లాల వారీగా కొత్త కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతుండగా. తాజాగా 500కు చేరువలో కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 39,604 నమూనాలను పరీక్షించగా.. 481 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 481 కరోనా కేసులు, ఒకరు మృతి
కొత్తగా నమోదైన 481 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,65,716కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఒకరు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,367కి పెరిగింది.

ఏపీలో 4837కు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 385 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,46,512కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 4,837 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,94,43,885 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 157 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 06, చిత్తూరులో 76, తూర్పుగోదావరిలో 157, గుంటూరులో 39, కడపలో 11, కృష్ణాలో 52, కర్నూలులో 08, నెల్లూరులో 23, ప్రకాశంలో 07, శ్రీకాకుళంలో 24, విశాఖపట్నంలో 38, విజయనగరంలో 14, పశ్చిమగోదావరిలో 26 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,701, చిత్తూరులో 2,46,804 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,953) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 12.84,552 నమూనాలను పరీక్షించగా.. 14,348 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసులు 3.42కోట్లకు పెరిగాయి. గురువారం మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 805 మంది మరణించారు. అయితే, ఇందులో 708 మరణాలు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఉండటం గమనార్హం. కాగా, గురువారం 13,198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.36 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 98.19 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. గురువారంనాడు 74,33,392 మందికి టీకా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 104.82 కోట్లకు చేరింది.












Click it and Unblock the Notifications