విజయవాడ-చెన్నై రూట్లో రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్- 16, 18 తేదీల్లో..!
విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) పరిధిలో జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెలలో చెన్నై వైపు రాకపోకలు సాగించే పలు రైళ్లపై (Trains) ప్రభావం పడబోతోంది. ఈ మార్గంలోని టెట్టు రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రాకపోకల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రత, సామర్థ్యం, రైళ్ల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ పనులు చేపడుతున్నారు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రద్దయిన రైళ్లలో 67259 విజయవాడ-బిట్రగుంట రైలు సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రద్దయింది. 67260 బిట్రగుంట-విజయవాడ రైలు సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రద్దయింది. 67225 విజయవాడ-గూడూరు రైలు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో రద్దయింది. 67226 గూడూరు-విజయవాడ రైలు సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రద్దు చేశారు. 17259 నెల్లూరు-విజయవాడ రైలు సెప్టెంబర్ 18న రద్దు చేశారు.

అలాగే 12841 హౌరా-చెన్నై సెంట్రల్ రైలు సెప్టెంబర్ 17న 2 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. 22641 తిరువనంతపురం సెంట్రల్-షాలిమార్ రైలు సెప్టెంబర్ 17న 2 గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. 20854 చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ రైలు సెప్టెంబర్ 18న 1 గంట 40 నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. వీటితో పాటు 12656 చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ రైలు సెప్టెంబర్ 18న 1 గంట 35 నిమిషాలు సమయం నియంత్రిస్తున్నారు. 17480 తిరుపతి-పూరీ రైలు సెప్టెంబర్ 18న 40 నిమిషాలు నియంత్రిస్తున్నారు.














Click it and Unblock the Notifications
