విజయవాడ మేయర్ సీటుకు టీడీపీలో 'పోటీ' రాజకీయం- జనసేన బిగ్ ట్విస్ట్..!?

ఏపీలో స్థానిక ఎన్నికల కోసం కసరత్తు కొనసాగుతోంది. వచ్చే వారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ప్రత్యక్ష విధానంలో మేయర్ ఎన్నిక జరగనుండటంతో టీడీపీ నుంచి వారసులు పలు చోట్ల బరిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ నుంచి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో రేసులోకి వచ్చారు. అక్కడే జనసేన నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

స్థానిక ఎన్నికల్లో పోటీ కోసం పలువురు నేతలు రేసులోకి వస్తున్నారు. కూటమి లోని మూడు పార్టీల నుంచి ప్రధాన ప్రాంతాల్లో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. తమకు బలం ఎక్కువగా ప్రాంతాల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని జనసేన - బీజేపీ కోరుతున్నాయి. సీట్ల విషయం పైన మూడు పార్టీల అధినేత లు నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ సీటు కోసం ఎన్నిక జరగనుంది. దీంతో.. విజయవాడ నగరంలో టీడీపీలో మాత్రం మేయర్ పదవి కోసం అప్పుడే పోటీ మొదలైంది.

స్థానిక ఎన్నికల్లో జగన్ ధీమా వెనుక, వరంగా మారిన ఆ నిర్ణయం - కొత్త లెక్కలు..!!
స్థానిక ఎన్నికల్లో జగన్ ధీమా వెనుక, వరంగా మారిన ఆ నిర్ణయం - కొత్త లెక్కలు..!!
Vijayawada Mayor Race Intensifies as TDP Aspirants Compete Jana Sena Eyes Seat here the details

విజయవాడ మేయర్ పరిధి.. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండటంతో..మూడు సెగ్మెంట్ల నుంచి పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభింారు. ఇప్పటికే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తన కుమారుడికి మేయర్ గా అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. ఎంపీ కేశినేని చిన్ని ఆశీస్సులతో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మేయర్ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

అదే విధంగా వీరితో పాటుగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో పాటు దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మహిళలకు మేయర్ పదవి రిజర్వ్‌ అయితే పోటీ మరింత పెరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. జనసేనాని పవన్, మనోహర్ గతంలోనే విజయవాడలో స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని స్పష్టం చేసారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన-బీజేపీ సీట్ల డిమాండ్ వేళ చంద్రబాబు కీలక నిర్ణయం, ఏరి కోరి..!!
స్థానిక ఎన్నికల్లో జనసేన-బీజేపీ సీట్ల డిమాండ్ వేళ చంద్రబాబు కీలక నిర్ణయం, ఏరి కోరి..!!

విజయవాడ మేయర్ సీటు పైన జనసేన ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో.. ఈసారి కూటమి సమీకరణాలు కూడా కీలకం కానున్నాయి. మూడు పార్టీలకు ఎన్ని డివిజన్లు కేటాయిస్తారు. ఏ సామాజిక వర్గానికి మేయర్ పీఠం రిజర్వ్ అవుతుంది. సామాజిక లెక్కలు కీలకం కానున్నాయి. అటు జనసేన ఆశిస్తున్న మేయర్ సీటు కోసం టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో.. చివరకు ఎవరికి ఈ సీటు వరిస్తుందనే ఉత్కంఠ కూటమి నేతల్లో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+