500, 1000, 2000 నోట్లు రద్దు చేయాలి - సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "మహానాడు" నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కడప వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాకుండా.. తెలంగాణ, దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సభా వేదికగానే సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

అలానే చంద్రబాబు మాట్లాడుతూ.. డిజిటల్ కరెన్సీ వచ్చాక నోట్లు అవసరం లేదని, దీనివల్ల అవినీతి తగ్గిపోతుందని చెప్పారు. అప్పట్లో డిజిటల్ కరెన్సీ రిపోర్టును PMకు ఇస్తూ ఓ విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. 500, వెయ్యి నోట్లు రద్దు చేసి కొత్తగా రెండు వేల నోటు తెచ్చారని.. ఇప్పుడు పరిస్థితుల్లో అవసరమైతే 500 సహా అన్ని పెద్ద నోట్లను రద్దు చేయాలని చెప్పారు. పెద్దనోట్లే అవినీతి మూలమని.. నోట్ల రద్దు ద్వారానే నిజమైన పారదర్శకత సాధ్యమవుతుందని అన్నారు.

500-1000-2000-notes-should-be-withdrawn-cm-chandrababu

తెలుగుదేశం పార్టీకి 43 ఏళ్ల పోరాట చరిత్ర ఉందని, ఈ కాలంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నామన్నారు. వైసీపీ పాలనలో జరిగిన హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు రాష్ట్రాన్ని నాశనం చేశాయని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు అన్నివిధాలుగా వేధింపులకు గురైనా, జెండా దించకుండా పోరాడిన ధైర్యాన్ని ప్రశంసించారు. ప్రత్యేకంగా పసుపు సింహం చంద్రయ్య ఉదాహరణను చెబుతూ, ఆయన చివరి శ్వాస వరకు పార్టీ నినాదం వేయడమే తమకో గర్వకారణమన్నారు.

అలానే చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో విలువలకు నిలువెత్తు మాదిరిగా నిలుస్తుందని చెప్పారు. నైతికత, నిజాయితీ, దూరదృష్టితో పార్టీ ఎదిగిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి లేకుండా పాలన అందించిన ఒకే ఒక్క పార్టీ టీడీపీయేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అవినీతిపై నిరంతరంగా పోరాడుతున్నామన్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని అనేక పార్టీల్లోనూ టీడీపీ లో తయారైన నాయకులే కీలక భూమికలు పోషిస్తున్నారని తెలిపారు.

మహానాడు వేదికగా చంద్రబాబు పలు సంక్షేమ హామీలను కూడా ప్రకటించారు. అన్నదాతలకు రూ. 20,000 మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే ప్రభుత్వం నడిపేందుకు తాము సిద్ధమని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని, పనిచేయని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+