ఏపీలో కొత్తగా వందలోపే కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే.?, పడిపోతున్న యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా 100లోపే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతూ వస్తోంది. తాజాగా, గత 24 గంటల్లో 28,788 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 55 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం వివరాలను వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 55 కరోనా కేసులు.. మరణాల్లేవ్..

ఏపీలో కొత్తగా 55 కరోనా కేసులు.. మరణాల్లేవ్..

తాజాగా నమోదైన 55 కొత్త కరోనా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,869కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 7162కి చేరింది.

ఏపీలో 735కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో 735కు తగ్గిన యాక్టివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో 117 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,80,972కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 735 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,25,46,228 కరోనా నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 6, చిత్తూరులో 9, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 6, కడపలో 5, కృష్ణాలో 6, కర్నూలులో 1, నెల్లూరులో 6, విశాఖపట్నంలో 2, విజయనగరంలో ఒక కేసు నమోదయ్యాయి. ఇక ప్రకాశం, శ్రీకాకుళం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

Recommended Video

    Covid-19 Vaccination in Telangana: మార్చి నుంచి అందరికీ అందుబాటులోకి కోవిడ్ టీకాలు !!
    దేశంలో లక్షన్నర దిగువకు యాక్టివ్ కేసులు

    దేశంలో లక్షన్నర దిగువకు యాక్టివ్ కేసులు

    మరోవైపు దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 6,97,114 నమూనాలను పరీక్షించగా.. 12,194 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940కి చేరింది. కొత్తగా 11,106 మంది మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,06,11,731కి చేరింది. గడిచిన 24 గంటల్లో 92 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,55,642కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,37,567 యాక్టివ్ కేసులున్నాయి. ఇది ఇలావుండగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 82 లక్షల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+