ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: నైట్ కర్ఫ్యూ పొడిగింపు, ఎప్పటి వరకంటే.?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఐదుగురు చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10,795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

ఏపీలో మళ్లీ లక్ష దాటిని కరోనా యాక్టివ్ కేసులు

ఏపీలో మళ్లీ లక్ష దాటిని కరోనా యాక్టివ్ కేసులు


కాగా, సోమవారం 5,879 కరోనా కేసులు నమోదవగా, మంగళవారం ఆ సంఖ్య పెరిగింది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,053 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 830 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. అనంతపురంలో 308, చిత్తూరులో 228, కడపలో 462, నెల్లూరులో 307, ప్రకాశంలో 324, శ్రీకాకుళంలో 194, విశాఖపట్నంలో 518, విజయనగరంలో 86, పశ్చిమగోదావరిలో 642 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు, ఎప్పటి వరకంటే.?

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు, ఎప్పటి వరకంటే.?


కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో నైట్‌కర్ఫ్యూను పొడిగించింది ఏపీ సర్కారు. ఈ మేరకు ఫిబ్రవరి 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. తొలుత ప్రభుత్వం జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఆ గడువు సోమవారంతో ముగియడంతో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలి. దీనిని అతిక్రమిస్తే రూ.100 జరిమానా విధిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంది. అటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కొనసాగనుంది. ప్రేక్షకులందరూ మాస్క్‌ ధరించాలి. ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులు మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

    COVID 19: Steps To Take If You Have COVID-19 | Oneindia Telugu
    దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా

    దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా


    మరోవైపు దేశవ్యాప్తంగానూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల నమోదులో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 2 లక్షల కంటే తక్కువగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మరో 1,192 మంది కరోనాతో మరణించారు. దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,96,242 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. రికవరీ రేటు 94.60 శాతానికి పెరిగింది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 1,66,68,48,204 డోసుల వ్యాక్సిన్ వేశారు. దేశంలో రోజువారీ కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+