40వేలు పెట్టుబడితో ఆరునెలల్లో 6లక్షలు.. లాభాల పంట పండించండి!
వ్యవసాయ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంట మార్పిడి విధానాలు, ఆధునిక వంగడాలను వినియోగించడం, ఎక్కువ లాభాలు వచ్చే పంటలపైన దృష్టి సారించడం వంటి అనేక చర్యలతో రైతన్నలకు లాభాల పంట పండించడానికి ప్రభుత్వాలు సైతం చర్యలు చేపడుతున్నాయి. కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకునే వారికి, కొత్త పంటలను పండించాలి అనుకునే వారికి అనేక విధాలుగా బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నాయి.
వెల్లుల్లి సాగుతో లాభాల పంట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వెల్లుల్లి సాగును లాభదాయకమైన వాణిజ్య పంటగా పరిగణిస్తారు ఈ క్రమంలోనే వెల్లుల్లి పంట సాగుపైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని రైతులకు చెప్తున్నారు. వెల్లుల్లి సాగుకు కావలసిన అనుకూలమైన భూమి ఉండి, సాగు చేయాలనే ఆలోచన ఉంటే కావలసిన పెట్టుబడిని బ్యాంకుల ద్వారా ఇవ్వడానికి కూడా సహకారం అందిస్తున్నారు. ఇక వెల్లుల్లి సాగు చేయాలనుకునే రైతులు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉద్యానవన మిషన్ ద్వారా విత్తనాలు, పరికరాల కోసం కావలసిన నిధులను పొందవచ్చు.

ఎకరానికి 40వేలు పెట్టుబడి పెడితే చాలు
ఎకరానికి 40 వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఆరు నెలల కాలంలో ఐదు నుండి ఆరు లక్షల రూపాయల లాభాలు వెల్లుల్లి సాగులో వచ్చే అవకాశం ఉంటుంది. వెల్లుల్లిని క్యాష్ క్రాప్ గా పరిగణిస్తారు. ఇది మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంట. ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వెల్లుల్లి పండించవచ్చు. ప్రతి సంవత్సరం భారతదేశం 57346 టన్నుల వెల్లుల్లిని విదేశాలకు పంపిస్తుంది.
జాతీయ ఉద్యానవన మిషన్ ద్వారా 40 శాతం వరకు సబ్సిడీ
ముఖ్యంగా బంగ్లాదేశ్ మరియు యూఏఈ వంటి ప్రదేశాలకు వెల్లుల్లి ఎగుమతి అవుతుంది. భారతదేశంలోని ప్రజలు గత సంవత్సరం నాలుగు లక్షల హెక్టార్లలో సంవత్సరానికి 3.2 మిలియన్ టన్నుల వెల్లుల్లిని ఉత్పత్తి చేస్తారు. వెల్లుల్లి 25 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉన్న వాతావరణంలో బాగా పెరుగుతుంది. విత్తనాలు మరియు పనిముట్లను కొనుగోలు చేయడానికి జాతీయ ఉద్యానవన మిషన్ 40 శాతం వరకు సబ్సిడీలను అందిస్తుంది.
రైతులకు కాసుల వర్షం కురిపించే వెల్లుల్లి
వెల్లుల్లి సాగుకు కావలసిన నీటిని అందించడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకుంటే అందులో కూడా సబ్సిడీని ఇస్తుంది. వెల్లుల్లి సాగుకు ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని, వ్యవసాయ మెళకువలను తెలుసుకొని సాగు చేస్తే ఇది లాభాల పంట పండిస్తుంది. రైతులకు ఇది కాసుల వర్షం కురిపిస్తుంది. ఆరు నెలల కాలంలో 40,000 పెట్టుబడితో ఆరు లక్షల వరకు ఆదాయం మరే బిజినెస్ లో వస్తుంది చెప్పండి. అయితే ఆదాయం మీ సాగు పద్దతులు, మెళకువలను బట్టి ఉంటుంది.












Click it and Unblock the Notifications