డిసిఎం రాజయ్య కాన్వాయ్ కారు ఢీకొట్టి 7 గురికి గాయాలు

రాజయ్య కాన్వాయ్ హనుమకొండ వైపు వస్తుండగా, అందులోని ఓ వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దాంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అది ఓ స్కూటర్‌తో పాటు మరిన్ని వాహనాలను ఢీకొట్టిందని రఘునాథపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
కాన్వాయ్‌లో వాహనం ఎదురుగా వస్తున్న ఇతర వాహనాలను కూడా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురికి స్వల్ప గాయలైనట్లు, వారిని జనగాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేసినట్లు, ఆ తర్వాత వారిని డిశ్చార్జీ చేసినట్లు అధికారులు చెప్పారు.
గాయపడినవారిలో రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌కు చెందిన జి. జగన్మోహన్, కె. బాబు కూడా ఉన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజయ్య వరంగల్ జిల్లాకు చెందినవారనే విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications