ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 12వేల మార్క్ దాటాయి, మరో 11 మరణాలు, జిల్లాల వారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

భారీగా పెరిగిన కేసులు, 11 మరణాలు..

భారీగా పెరిగిన కేసులు, 11 మరణాలు..

గత 24 గంటల్లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 51 మంది, ఇతర దేశాల నుంచి ఐదుగురు ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,285కు చేరింది. గడిచిన24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 157కు చేరింది.

జిల్లాల వారీగా కొత్త కేసులు

జిల్లాల వారీగా కొత్త కేసులు

గత 24 గంటల్లో 263 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5289కు చేరింది. మరో 6648 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 161, తూర్పుగోదావరి జిల్లాలో
109, చిత్తూరు జిల్లాలో 84, గుంటూరు జిల్లాలో 71, కర్నూలు జిల్లాలో 69, కృష్ణాలో 53, కడప జిల్లాలో 50, పశ్చిమగోదావరి జిల్లాలో 44, విశాఖపట్నంలో 34, ప్రకాశంలో 26, నెల్లూరులో 24, విజయనగరం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.

అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు..

అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు..


కాగా, రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1684 పాజిటివ్ కేసులుండగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1320 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 1252కు చేరాయి. గుంటూరు జిల్లాలో 1103, తూర్పుగోదావరి జిల్లా 945, చిత్తూరు జిల్లా 809, పశ్చిమగోదావరిలో 804, కడపలో 683, నెల్లూరులో 561, విశాఖపట్నంలో 461, ప్రకాశంలో 272, విజయనగరంలో 137, శ్రీకాకుళంలో 62, ఇతరులు 56 నమోదయ్యాయి.

Recommended Video

    Patanjali's Coronil: FIR Against Yoga Guru Ramdev ప్రజలను మోసం చేసారంటూ 420 కింద కేసు ! || Oneindia
    దేశంలో 5 లక్షలు దాటిన కేసులు..

    దేశంలో 5 లక్షలు దాటిన కేసులు..


    ఇక దేశ వ్యాప్తంగా 5,10,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 1,98,541 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,96,381 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 15,712 మంది మరణించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+