ఏపీలో కొత్తగా 8732 కరోనా పాజిటివ్ కేసులు... మరో 87 మంది మృతి....

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8732 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 87 మంది మృతి చెందారు. ఇందులో చిత్తూరు జిల్లాలో 10 మంది,గుంటూరు జిల్లాలో 9 మంది,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున,అనంతపురం,కడప,కర్నూలు జిల్లాల్లో 7 మంది చొప్పున, నెల్లూరు,విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున,ప్రకాశం,శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున,కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున కరోనాతో మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 2562కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 53,712 కరోనా టెస్టులు చేయగా... మొత్తం టెస్టుల సంఖ్య 28,12,197కి చేరింది. తాజాగా మరో 10,414 మంది క‌రోనా నుంచి కోలుకుని కోవిడ్ 19 ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 1,91,117 మంది డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 88,138 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 8732 new coronavirus cases reported in andhra pradesh on thursday

తాజాగా నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో 959 కేసులతో చిత్తూరు,894 కేసులతో విశాఖపట్నం,851 కేసులతో అనంతపురం ఉన్నాయి.

కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ 82971 04104 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. కరోనా సోకితే కనిపించే లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పరీక్షల వివరాలను హెల్ప్ లైన్ ద్వారా వివరించనున్నారు. కరోనా సోకితే ఎవరిని సంప్రదించాలి... ఏం చేయాలన్న సందిగ్ధం ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో ఈ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

Recommended Video

    Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+