ఇండియన్ రైల్వే.. వందే భారత్ గుడ్ న్యూస్
వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడంద్వారా భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని భావిస్తున్నారు. దేశంలో చివరిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలును జులై 7న ప్రారంభించారు. రెండు నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు మరో వందే భారత్ ఎక్కడా ప్రారంభం కాలేదు. అయితే ఏకంగా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. మార్గాలు కూడా సిద్ధమవగా, రైళ్లు కూడా సిద్ధమవుతున్నాయి.
ఇండోర్ - జైపూర్, జైపూర్-ఉదయ్‌పూర్, జైపూర్-చండీగఢ్, పూరి-రౌర్కెలా, పాట్నా-హౌరా మార్గాల్లో త్వరలోనే వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. పూరి-రౌర్కెలా వందే భారత్ రైలు సెప్టెంబర్ 30న ప్రారంభించనున్నారు. మిగతా నాలుగు మార్గాలకు అనుమతులు రావాల్సి ఉంది. ఇందులో ఒక రైలును సదరన్ రైల్వేస్‌కు కేటాయించారని వార్తలు వస్తున్నాయి. సదరన్ రైల్వే ఈ రైలును చెన్నై-విజయవాడ మార్గంలో తిరుపతి మీదుగా నడిపే ఆలోచనలో ఉంది.

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో కూడా మరో వందే భారత్ రైలు ప్రారంభం కాబోతోంది. ఈ రైలు కర్నాటక ఎన్నికల సమయం నుంచి పెండింగ్‌లోనే ఉంది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వీటని తయారు చేస్తోంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి ప్రతిరోజు 50 సర్వీసుల్ని అందిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో వారానికి ఆరు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే చెన్నై-విజయవాడ, సికింద్రాబాద్-భువనేశ్వర్, సికింద్రాబాద్-పుణె, కాచిగూడ-యశ్వంత్ పూర్ మార్గాల్లో కూడా ఈ రైళ్లు పరుగులు తీయబోతున్నాయి.












Click it and Unblock the Notifications