AP Municipal Commissioners: ఏపీలో 92 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ..!
ఏపీలో ఇవాళ భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేయడంతో పాటు పలు చోట్ల పోస్టింగ్స్ కూడా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. అలాగే ఈ బదిలీల వెనుక కారణాలను కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఇవాళ బదిలీ చేసిన వారిలో మున్సిపల్ కమిషనర్లతో పాటు అదనపు కమిషనర్లు కూడా ఉన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వీరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసిన వారు,వచ్చే జూన్ 30 కి మూడేళ్లు పూర్తయ్యే వారిని బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు వీరిని బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీలపై ఈసీ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఈ బదిలీలు చేస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తెలిపింది. ఏ అధికారిని కూడా సొంత జిల్లాలో పనిచేసే అవకాశం లేకుండా ఇతర జిల్లాలకు పంపాలని ఈసీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ బదిలీలు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే గత నాలుగేళ్లలో మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారిని సైతం బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.
అలాగే తాజాగా బదిలీ అయిన అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు కూడా పెండింగ్ లో లేవని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయా అధికారులపై భారీగా పెనాల్టీ కూడా విధించలేదని పేర్కొంది. అలాగే వీరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెండింగ్ లో లేవని తెలిపింది. అలాగే వచ్చే ఆరు నెలల్లో ఇందులో ఏ అధికారి కూడా రిటైర్మెంట్ అయ్యే వారు లేరని కూడా వెల్లడించింది.












Click it and Unblock the Notifications