చదువు భారమైందని బాలుడి ఆత్మహత్య: ’సారీ‘అని నోట్
హైదరాబాద్: ఆ బాలుడికి చదువు బారమైంది. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకుగురైన ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ ఓ సూసైడ్ నోట్ రాశాడు. ‘సారీ అమ్మా, నాన్న.. నాకు వేరే ఛాయిస్ లేదు. నేను చదువును భరించలేకపోతున్నా' అని సూసైడ్ నోట్ రాసిన ఆ 14ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. పద్మారావునగర్‌కు చెందిన వెంకటేష్ గౌడ్, అలివేలు దంపతులకు ఓ కూతురు, కుమాడు పవన్(14) ఉన్నారు. కూతురు బీఫార్మసీ చదువుతోంది. భార్యాభర్తలిద్దరూ బుధవారం వారి విధుల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లారు.

వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పవన్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. కాగా, రాత్రి ఏడున్నర గంటలకు పవన్ సోదరి కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా పవన్ పలకకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్‌కు లుంగీతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరో ఘటనలో పిల్లలు చదువుకు దూరమవుతారని ఆందోళన చెందిన ఓ తల్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. 90శాతం గాయాలపాలైన బాధితురాలు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యాకుత్ పురాలోని ఓవైసి నగర్‌లో నివసిస్తున్న ఇస్మాయిల్, అంబారీ రెహమాని(30)ల ఇద్దరు పిల్లలు 4, 6 తరగతులు చదువుతున్నారు. పాఠశాల యాజమాన్యం పిల్లలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. తన పిల్లలు చదువుకు దూరమవుతారని ఆందోళన చెందిన రెహమాని ఒంటికి నిప్పంటించుకుంది.












Click it and Unblock the Notifications