రామ్మోహన్ గారూ... తిరుమలలో ఉల్లంఘనలు అడ్డుకోండి..!!
Tirumala: తిరుమలలో ఆగమశాస్త్ర నిబంధన ఉల్లంఘన జరిగింది. తిరుమల కొండ పైన శ్రీవారి ఆలయం సమీపంలో ఏయిర్ క్రాఫ్ట్ వెళ్లటం కలకలం రేపుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో ఇదే రకంగా జరిగిన తరువాత టీటీడీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదులు చేసారు. తిరుమల నిబం ధనలకు వ్యతిరేకంగా విమానాలు..హెలికాప్టర్ల కు అవకాశం లేకుండా చూడాలని అభ్యర్ధించారు. కానీ, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో, ఏపీ నుంచే ప్రస్తుతం విమానాయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
తిరుమలలో మరో సారి ఆగమశాస్త్ర ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటుచేసుకుంి. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది. అయితే ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలోనే ఆగమ పండితులు స్పష్టం చేసారు. అయితే, కొంత కాలంగా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలను నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారిక నిర్ణయం జరగ లేదు. దీని పైన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత ఆరు నెలల కాలంలోనే వరుసగా విమానాలు ఆలయం మీదుగా వెళ్లటం పైన అధికారులు నేరుగా విమానయాన శాఖతో చర్చించారు. విమానాలు వెళ్లటం పైన ఆరా తీసారు. అయితే, అధికారికంగా కేంద్రం నుంచి నిర్ణయం లేని కారణంగా నో ఫ్లై జోన్ అమలు కావటం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 7న ఉదయం 8.14 గంటలకు తీరుమల మీదుగా విమానం ప్రయాణించింది. గత ఏడాది ఫిబ్రవరి 15న ఆలయం గోపురం పైనుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి. ఇప్పుడు ఏపీకి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా పౌర విమానయాన శాఖ పర్యవేక్షిస్తున్నారు.
దీంతో, మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది. కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల ను నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే టీటీడీ నుంచి ఈ మేరకు అధికారికంగా ప్రతిపాదన లు అందాయి. దీంతో, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఏం చేస్తారనేది భక్తులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications