ఆపరేషన్ పెద్దిరెడ్డి, జాతరను తలపించిన పెద్దిరెడ్డి అనుచరుల బాధితులు, సిసోదియా
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం దెబ్బకు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గీయులు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బాదితులు ఏ పదిమందో వచ్చి ఫిర్యాదులు చేస్తారని అనుకుంటే జాతరకు వచ్చినట్లు జనాలు వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పీ సిసోదియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11.24 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీసులోని ఫైళ్లకు కావాలనే నిప్పంటించారని, ఇందులో పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని టీడీపీ నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆ రోజే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ, సీఐడీ చీఫ్, అగ్నిమాపక శాఖ చీఫ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా, ఫోరెన్సిక్ నిపుణులు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా కలెక్టర్లు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఇప్పటికే వివరాలు సేకరించారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన వర్గం భూ బాదితులు ఎవరైనా ఉంటే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చెయ్యాలని, మేము న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా ప్రజలకు మనవి చేశారు.
విషయం తెలుతుసుకున్న వందలాది మంది బాధితులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సీసోదియాకు వినతిపత్రాలు సమర్పించి మాకు న్యాయం చెయ్యాలని మనవి చేశారు తిరుమతిలో ఎస్ఐగా పని చేసి రిటైడ్ అయిన చౌలేశ్వరయ్య పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియాకు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపుతోంది. రిటైడ్ ఎస్ఐ చౌలేశ్వరయ్య ఏకంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఫిర్యాదు చెయ్యడంతో సిసోదియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలోని పెద్దిరెడ్డి అడ్డా సదుంలోని సర్వే నెంబర్ 495/3లో 1.69 ఎకరాలు, సర్వే నెంబర్ 495/2 ఉన్న 1.82 ఎకరాలు భూమిని పెద్దిరెడ్డి చిన్నాన కుమారుడు పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కబ్జా చేశారని, తన సోదరుడు చెన్నకేశవులుకు చెందిన 4.50 ఎకరాల భూమిని కూడా వీళ్లే కబ్జా చేశారని, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఎదురు తిరిగితే చంపేస్తారనే భయంతో ఇంతకాలం తాము మౌనంగా ఉన్నామని రిటైడ్ ఎస్ చౌలేశ్వరయ్య బోరున విలపించడంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది.

తన పిలుపు మేరకు పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల బాదితులు పదుల సంఖ్యలో వస్తారని తాను అనుకున్నానని, అయితే వందల సంఖ్యలో ఇంత మంది బాదితురాలు జాతరకు వచ్చినట్లు రావడంతో తాను కూడా షాక్ అయ్యానని, పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు ఆయన వర్గీయులు మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజక వర్గాల్లో అనేక చోట్ల కబ్జాలు చేశారని ఫిర్యాదులు వచ్చాయని, ఇది వ్యవస్థను తప్పుదోవ పట్టించే అంశం అని, ప్రభుత్వంతో చర్చించి బాధితులకు న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా అన్నారు.
పెద్దిరెడ్డి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, భయంతో చాలా మంది బయటకు రావడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంకా చాలా మంది పెద్దిరెడ్డి వర్గీయుల బాదితులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి వర్గీయుల బాదితులు ఎంత మంది ఉన్నారు, ఎన్నివేల ఎకరాలు భూములు కబ్జా అయ్యాయి అని పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబందిత అధికారులను ఆదేశించారని తెలిసింది.












Click it and Unblock the Notifications