'సన్ రైజ్ ఏపీ' పంద్రాగస్టు కాస్ట్‌లీ! 'టీ' 45 లక్షలు రిలీజ్
హైదరాబాద్/కర్నూలు: విభజన అనంతరం తొలి పంద్రాగస్టు వేడుకలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ కంటే ఏపీ పంద్రాగస్టు వేడుకల ఖర్చు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ కర్నూలులో, తెలంగాణ గోల్కొంట కోట పైన పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనున్నాయి.
పంద్రాగస్టు వేడుకల నిమిత్తం ఏపీ ప్రభుత్వానికి ఏడెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు కానుందట. ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్‌కు ఐదు కోట్ల రూపాయలు, అరేంజ్‌మెంట్స్ కోసం మూడు కోట్ల రూపాయలు సాంక్షన్ చేసిందట. రూ.1.21 కోట్లు సెక్యూరిటీ నిమిత్తం పోలీసు డిపార్టుమెంటుకు, ఇతరాలకు సాంక్షన్ చేసింది. పోలీసు డిపార్టుమెంట్ అంతకంటే ఎక్కువనే అడిగిందట.

సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో పంద్రాగస్టు వేడుకల నిర్వహణకు రూ.డెబ్బై నుండి రూ.ఎనభై లక్షల వరకు ఖర్చు అయ్యేది. అయితే, ఈసారి ఏపీ కర్నూలులో వేడుకలు నిర్వహించనుంది. ఇందుకోసం అధికారులు, ముఖ్యమంత్రి సహా అందరూ కర్నూలుకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయాణ ఖర్చులు.. ఇలా అన్నింటిని కలుపుకొని బడ్జెట్ పెరిగిందని చెబుతున్నారు.
పంద్రాగస్టు వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం నిధుల విడుదల
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.45 లక్షలను నిధులు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఈసారి వేడుకలు నిర్వహించనున్నారు.
మరోవైపు, ఏపీ ప్రభుత్వం కోటి 21 లక్షల 98 వేల రూపాయల భారీ మొత్తాన్ని బుధవారం విడుదల చేసింది. కర్నూలు కోటలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు జెండా ను ఎగురవేస్తారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను 'సన్‌రైజ్ ఏపీ' పేరుతో నిర్వహించనున్నారు. అలాగే, జిల్లాల వారీగా ఏ మంత్రి ఎక్కడ జెండా ఎగురవేయాలనే దానిపై కూడా ఏపీ ప్రభుత్వం విధివిధాలను ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications