కసాయి కూతురు .. కృష్ణా జిల్లాలో కట్నం కోసం భర్తతో కలిసి తల్లిదండ్రుల గొంతు కోసి హతమార్చిన తనయ

కంటే కూతుర్నే కనాలి అంటారు. తల్లిదండ్రులను చూసేది ఆడపిల్లలు మాత్రమే అని గొప్పగా చెబుతారు. కానీ అలాంటి ఆడపిల్లలు కూడా అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం లో జరిగిన దారుణం ఒక కుమార్తె యొక్క క్రూరత్వానికి అద్దం పడుతుంది.

Recommended Video

    #crime తల్లిదండ్రుల్ని హత్య చేసిన కూతురు

     భర్త సహాయంతో తల్లిదండ్రుల గొంతు కోసి హతమార్చిన కూతురు

    భర్త సహాయంతో తల్లిదండ్రుల గొంతు కోసి హతమార్చిన కూతురు

    రక్త సంబంధాలకు, మానవతా విలువలకు తిలోదకాలిచ్చిన ఓ కూతురు భర్త సహాయంతో తల్లిదండ్రుల గొంతు కోసి హతమార్చింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండి పాలెం గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనలో కట్నం కోసం కన్న కూతురు, భర్తతో కలిసి తల్లిదండ్రులు హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది. 3 నెలల క్రితం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండి పాలెం గ్రామానికి చెందిన మనీషా, బాబు రావ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. బాబురావు జగ్గయ్యపేటలో వాలంటీర్ గా పని చేస్తున్నాడు.

    కట్నం కోసం భర్తతో కలిసి తల్లిదండ్రులకు కూతురు వేధింపులు . ఆపై దారుణ హత్యలు

    కట్నం కోసం భర్తతో కలిసి తల్లిదండ్రులకు కూతురు వేధింపులు . ఆపై దారుణ హత్యలు

    ఇద్దరూ ఆమె తల్లిదండ్రులను కట్నం కోసం వేధింపులకు గురి చేసేవారు. వివాహం అయినప్పటి నుండి అల్లుడు, కూతురు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తూ చివరకు నిన్న అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో తండ్రి ముత్తయ్య, తల్లి సుగుణమ్మలను తన భర్తతో కలిసిఅత్యంత పాశవికంగా గొంతుకోసి హతమార్చింది. మొదట ముత్తయ్యను హతమార్చే సమయంలో తల్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అక్కడ తల్లి పెనుగులాడినట్టుగా సంఘటనా స్థలంలో ఆధారాలతో అర్ధం అవుతుంది.

    కూతురే, అత్యంత పాశవికంగా కసాయిగా మారి .. షాక్ అయిన స్థానికులు

    కూతురే, అత్యంత పాశవికంగా కసాయిగా మారి .. షాక్ అయిన స్థానికులు

    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కన్న తల్లిదండ్రులను హతమార్చిన మనీషా తన భర్తతో కలిసి ప్రస్తుతం పరారీలో ఉంది. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కనీసం మానవత్వం లేకుండా కసాయి లాక్ అన్న తల్లిదండ్రుల్ని హతమార్చిన కూతుర్ని అల్లుడిని కఠినంగా శిక్షించాలని బండిపాలెం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు .ఏది ఏమైనప్పటికీ అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురే, అత్యంత పాశవికంగా కసాయిగా మారి కన్న తల్లిదండ్రులను కడతేర్చటం మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+